భండారు సదాశివరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''భండారు సదాశివరావు''' ప్రముఖ [[రచయిత]] మరియు కవి.<ref>[http://www.esahithi.com/kavitalu/default.aspx?writer=1 సాహితీ సౌరభాలు]</ref>
==జీవిత విశేషాలు==
'''భండారు సదాశివరావు''' [[క్రోధన]] నామ సంవత్సరం [[జ్యేష్టజ్యేష్ఠ శుద్ధ షష్టిషష్ఠి]]కి సరియైన [[1925]], [[మే 29]]తేదీ భండారు వీరరాజేశ్వరరావు, వెంకురామమ్మ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్లు. ఇతడు ఆరువేల నియోగి. పరాశర గోత్రీకుడు. కృష్ణాజిల్లాలోని వేములపల్లి అగ్రహారం ఇతని స్వగ్రామం. ఇతని కుటుంబం వరంగల్లులో స్థిరపడింది.
ఈయన హిందీలో సాహిత్యరత్న చదివాడు. సాహిత్యరత్న చేయడానికి [[కాశీ]] వెళ్ళినప్పుడు ఈయనకు ఓరుగంటి సుబ్రహ్మణ్యంతో పరిచయమైంది. అతని ద్వారా [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్|రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో]] చేరాడు. 1948లో [[జాగృతి]] పత్రికను ప్రారంభించి దానికి ఆయన సహాయ సంపాదకుడిగా సేవలందించాడు. హిందీని ఆంగ్లంలోకి అవలీలగా ఆయన అనువాదం చేసేవాడు. కలం పేరుతో ఈయన చేసే రచనల్లో వ్యంగ్యం, విమర్శలు ఉండేవి. కాశీ నుంచి సంఘ్ ప్రచారక్‌గా రాష్ట్రానికి వచ్చిన తరువాత ఈయన అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. విశాఖలో ప్రచారక్‌గా ఉన్నప్పుడే భారతీయ విద్యా కేంద్రం ప్రారంభించాడు. ప్రచారక్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నాక స్వస్థలం వరంగల్లులో స్థిరపడ్డాడు. ఈయన 1975లో జాతీయ సాహిత్య పరిషత్‌ను స్థాపించారు. ఎమర్జన్సీ సమయంలో వరంగల్లు జైలులో ఈయన 19 నెలలు శిక్షను అనుభవించాడు. చివరి దశలో ఈయన తన చిన్నకుమారుడు దగ్గరకు అమెరికా వెళ్ళాడు. అక్కడే ఈయన [[2010]], [[ఏప్రిల్ 3]] శనివారం కన్నుమూసాడు.<ref>[http://archives.andhrabhoomi.net/state/badaaru-death-912 సాహితీ వేత్త భండారు కన్నుమూత]</ref>
 
"https://te.wikipedia.org/wiki/భండారు_సదాశివరావు" నుండి వెలికితీశారు