2004 సునామీ: కూర్పుల మధ్య తేడాలు

మరికొన్ని వివరాలు చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
డిసెంబరు 26, 2004 వ సంవత్సరంలో [[హిందూ మహా సముద్రం]]లో సుమత్రా, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన [[సునామీ]] 14 దేశాల్లో సుమారు 230,000 మందిని పొట్టనబెట్టుకుంది. దీని పరిమాణం 9.1–9.3 గా నమోదయ్యింది. భారత భూభాగంలోని టెక్టానిక్ ప్లేట్లు, బర్మా భూభాగానికి చెందిన టెక్టానిక్ ప్లేట్లతో రాపిడి చెందడం వల్ల సముద్రగర్భంలో భారీ భూకంపాలు ఏర్పడ్డాయి. దీని ఫలితంగా సముద్రపు అలలు సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి పడి తీర ప్రాంతాలను ముంచి వేశాయి. ఈ విపత్తు వల్ల [[ఇండోనేషియా]] తీవ్రంగా నష్టపోయింది. [[శ్రీలంక]], [[భారతదేశం]], [[థాయ్ లాండ్]] దేశాలు కూడా ఈ భూకంపం ధాటికి నష్టపోయాయి. ప్రపంచలోనే అత్యంత ఘోరవిపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది. [[సీస్మోగ్రాఫు]] మీద రికార్డయిన మూడో అతి పెద్ద భూకంపం ఇది.
== లక్షణాలు ==
ఈ భూకంపం పరిమాణాన్ని మొదటగా 8.8 గా లెక్కగట్టారు. ఫిబ్రవరి 2005లో శాస్త్రజ్ఞులు దీన్ని మళ్ళీ 9.0 కి సవరించారు. <ref>McKee, Maggie. "[http://www.newscientist.com/article.ns?id=dn6991 Power of tsunami earthquake heavily underestimated]." ''[[New Scientist]]''. 9 February 2005. {{wayback|url=http://www.newscientist.com/article.ns?id=dn6991 |date=20050227152442 |df=y }}</ref> ఫసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ దీన్ని ఆమోదించింది. కానీ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే మాత్రం దాని అంచనా 9.1 ని మార్చలేదు. ఇటీవల 2006 లో జరిపిన పరిశోధనల ప్రకారం దాని పరిమాణం 9.1–9.3 ఉండవచ్చునని తేల్చారు. క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన డాక్టర్ హిరూ కనమోరి దీని పరిమాణం ఉజ్జాయింపుగా 9.2 ఉండవచ్చునని అంచనా వేశాడు.<ref>EERI Publication 2006–06, page 14.</ref>
== మూలాలు ==
 
[[వర్గం:ప్రకృతి వైపరీత్యాలు]]
"https://te.wikipedia.org/wiki/2004_సునామీ" నుండి వెలికితీశారు