అమరచింత సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
== చరిత్ర ==
కాకతీయుల కాలంలో [[గోన బుద్ధారెడ్డి]] అధీనంలో [[వర్ధమానపురం]] ఉండేది. దానికి గోపాలరెడ్డి అను వ్యక్తి [[దేశాయి]] గా ఉండేవాడు. అతని అమూల్య సేవలకు గుర్తింపుగా బుద్ధారెడ్డి క్రీ.శ. 1292లో [[మక్తల్]] పరగణాను గోపాలరెడ్డికి నాడగౌడికంగా ఇచ్చాడు. గోపాలరెడ్డి అనంతరం ఆయన రెండో కుమారుడు చిన్న గోపిరెడ్డి నాడగౌడికానికి వచ్చాడు. మక్తల్ తో పాటు మరో నాలుగు మహళ్ళు గోపిరెడ్డి నాడగౌడికం కిందికి వచ్చాయి. ఆ నాలుగింటిలో అమరచింత ఒకటి. ఈ చిన్న గోపిరెడ్డి మనువడి మనువడి పేరు కూడా గోపిరెడ్డే. ఇతనిని ఇమ్మడి గోపిరెడ్డి అని అంటారు. ఇతను క్రీ.శ. 1654 ప్రాంతానికి చెందినవాడు. ఇతని అన్నగారు సాహెబ్ రెడ్డి. వారసత్వంగా వచ్చిన అయిదు మహళ్ళలో సాహెబ్ రెడ్డికి మూడు మహళ్ళు పోగా, మిగిలిన రెండు మహళ్ళు వర్ధమానపురం, అమరచింత ఇమ్మడి గోపిరెడ్డి వంతులోకి వచ్చాయి. క్రీ.శ.1676 ప్రాంతంలో ఇమ్మడి గోపిరెడ్డి కుమారుడు సర్వారెడ్డి నాడగౌడికానికి వచ్చాడు. ఆ తర్వాత ఈ అమరచింత క్రమంగా వృద్దిచెంది సంస్థానంగా రూపొందింది<ref> సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటి రాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-32</ref>. సర్వారెడ్డి అభ్యుదయ విధానాలు కలవాడు. నీటి వనరులు పెంచడానికి పెద్దవాగుకు ఆనకట్ట కట్టించాడు. ఇతను [[ఔరంగజేబు]] సైన్యాలకు సాయం చేశాడు. తత్ఫలితంగా జండా, నగరా, 500 సవార్లు మొదలైన రాజలాంఛనాలు పొందాడు. ఇతని తరువాత మరో ఆరుగురు రాజులు ఈ సంస్థానాన్ని పాలించారు.
అమరచింత సంస్థాన వంశము యొక్క వారసులలో ఒకడైన రాజా శ్రీరాం భూపాల్‌ మరణించిన తర్వాత అతని భార్యకు న్యాయబద్ధముగా సంస్థానము యొక్క వారసత్వము సంక్రమించినది.
 
"https://te.wikipedia.org/wiki/అమరచింత_సంస్థానం" నుండి వెలికితీశారు