అచ్యుత దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Robot-assisted disambiguation: ఆలూరు
పంక్తి 20:
==రామరాయల కుట్రలు==
{{చూడండి|అళియ రామ రాయలు}}
రాజధానిలో రామరాయలు బలం నానాటికి పెరగ సాగింది. రామరాయల తమ్ములు వెంకటాద్రి, తిరుమలలు అతడికి అండగా ఉన్నారు. [[కందనవోలు]], [[అనంతపూరు]], [[ఆలూరు, కర్నూలు|ఆలూరు]], [[అవుకు]] దుర్గాధిపతులు రామరాజు పక్షము వహించారు. ఇంతలో బీజాపూరులో మల్లూ ఆదిల్‌షాను తొలగించి [[ఇబ్రహీం ఆదిల్‌షా]] గద్దెనెక్కి, మల్లూ సానుభూతిపరులైన ఉద్యోగులను, మూడు వేల సైన్యాన్ని తొలగించాడు. అలా తొలగించబడిన సైనికులను రామరాయలు తన సైన్యములో చేర్చుకొని రాజధానిలోని తురకవాడలో నిలిపి ఉంచాడు.<ref name=nv59>ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.59</ref>
 
1536లో [[గుత్తి]] ప్రాంతములోని తిరుగుబాటును అణచి [[తిరుమల]] వేంకటేశ్వరుని దర్శించుకొని రాజధానికి తిరిగివస్తున్న అచ్యుతరాయలను బంధించి, రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించి పట్టాభిషేక ప్రయత్నాలు జరిపాడు. కృష్ణదేవరాయల భార్యలు తిరుమలదేవి, చిన్నాదేవి రామరాయలకు మద్దతు నిచ్చారు. కానీ ప్రజలు, సామంతులు రామరాయలు సింహాసనాన్ని ఆక్రమించడాన్ని ఇష్టపడలేదు. పట్టాభిషేకానికి అన్నీ సన్నద్ధం చేసుకున్నా, రాయరాయల పట్టాభిషేకం జరగలేదు<ref name=nv60>ఎన్.వెంకటరమణయ్య (1935), పేజీ.60</ref>. [[మధుర]], [[కొచ్చిన్]] ప్రాంత సామంతులు కప్పం చెల్లించడం నిలిపివేశారు. రామరాయలు వారిపై దండయాత్రకు బయలుదేరిన సమయములో రాజధానిలోని ఉద్యోగులు సలకం పెద తిరుమలరాజుతో చేరి, అచ్యుతరాయల్ని చెర నుండి విడిపించి సింహాసనముపై పునఃప్రతిష్టించారు.
"https://te.wikipedia.org/wiki/అచ్యుత_దేవ_రాయలు" నుండి వెలికితీశారు