తొట్టెంపూడి వేణు: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox person | name = తొట్టెంపూడి వేణు | | birthname = తొట్టెంపూడి వేణు | birth_date...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
|image =
}}
'''తొట్టెంపూడి వేణు''' ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు.
 
వేణు ధార్వాడ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమా పరిశ్రమకు వచ్చాడు. మొదటగా [[భారతీరాజా]] దర్శకత్వంలో ఓ సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కొన్ని అవాంతరాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. వేణు స్నేహితుడైన వెంకట శ్యామ్ ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఆ సంస్థ సారథ్యంలో కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో 1999లో వచ్చిన స్వయంవరం అనే సినిమా వేణు తొలి సినిమా. ఇందులో లయ కథానాయికగా నటించింది. లయకు కూడా ఈ సినిమా మొదటిది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఆ సినిమాలో నటనకు వేణుకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలోనే 2000లో వచ్చిన చిరునవ్వుతో అనే సినిమా కూడా విజయాన్ని చవిచూసింది.
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తొట్టెంపూడి_వేణు" నుండి వెలికితీశారు