"తెలుగు సినిమా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[తెలుగు సినిమాలు 2005|2005]], [[తెలుగు సినిమాలు 2006|2006]] మరియు [[తెలుగు సినిమాలు 2008|2008]] సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ [[బాలీవుడ్]]ని అధిగమించి దేశం లోనే అత్యధిక చిత్రాలని నిర్మించినది. [[రామోజీ ఫిల్మ్ సిటీ]] ప్రపంచం లోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో గా [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నీస్ బుక్]] లో నమోదైనది. హైదరాబాదులో గల '''ప్రసాద్స్ ఐమ్యాక్స్''' ప్రపంచం లోనే అతి పెద్ద 3డీ ఐమ్యాక్స్ స్క్రీనే గాక, అత్యధికంగా సినిమాని వీక్షించే స్క్రీను. దేశంలోనే అధిక సినిమా థియేటర్ లు [[ఆంధ్ర ప్రదేశ్]] లోనే కలవు.
 
సి ఎన్ ఎన్ - ఐ బి ఎన్ గుర్తించిన ఉత్తమ వంద చిత్రాలలో మొదటి పది [[పాతాళ భైరవి]](1951), [[మల్లీశ్వరి]](1951), [[దేవదాసు]](1953), [[మాయాబజార్]](1957), [[నర్తనశాల]](1963), [[మరో చరిత్ర]](1978), [[మా భూమి (సినిమా)|మా భూమి]](1979), [[శంకరాభరణం]] (1979), [[సాగర సంగమం]](1983), [[శివ]](1989) మొదటి పది స్థానాలని దక్కించుకొన్నాయి.
 
[[సినిమా]] [[తెలుగు]] వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. [[భారతీయ సినిమా]]లో సంఖ్యాపరంగా అత్యధికంగానూ, వాణిజ్య పరంగా రెండవ స్థానంలోనూ (ఇంచుమించు తమిళ సినీరంగానికి కుడియెడంగా) తెలుగు సినిమా వర్ధిల్లుతోంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1875001" నుండి వెలికితీశారు