భారతీయ మామిడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
|}}
 
'''భారతీయ మామిడి''' యొక్క [[వృక్ష శాస్త్రీయ నామం]] మ్యాంగిఫీరా ఇండికా. అనాకార్డియాసియా కుటుంబానికి చెందిన [[మామిడి]] జాతి రకాలలో ఇది ఒకటి. [[భారతదేశం]] [[అడవి|అడవులలోను]] మరియు [[సాగు]] ప్రాంతాలలో కనిపించే ఈ రకాలు ప్రపంచంలోని ఇతర ఉష్ణ ప్రాంతాలకు పరిచయం చేయబడింది. ప్రపంచంలోని అతిపెద్ద [[పండు|పండ్ల]] వృక్షం ఇది. ఈ చెట్టు వంద [[అడుగు]]ల ఎత్తు పెరిగే సామర్థ్యం కలిగి ఉంది. [[ఛాతి ఎత్తు వద్ద]] దీని చుట్టుకొలత సగటున పన్నెండు అడుగుల నుంచి పద్నాలుగు [[అడుగులు]] ఉంటుంది. కొన్నిసార్లు దీని చుట్టుకొలత ఇరవై అడుగులకు చేరుకుంటుంది. ఈ మామిడి జాతులను నాలుగువేల సంవత్సరముల క్రితం నుంచే పెంచుతున్నట్లుగా తెలుస్తుంది. భారతదేశం నుండి తూర్పు ఆసియాకు [[క్రీ.పూ]] 400 నుంచి 500 సంవత్సరముల మధ్య ఈ జాతులు తీసుకురావడం జరిగింది. తరువాత 15వ శతాబ్దంలో ఫిలిప్పీన్స్ కు ఆ తరువాత 16వ శతాబ్దంలో [[పోర్చుగీస్]] వారి ద్వారా ఆఫ్రికా మరియు బ్రెజిల్ కు తీసుకురావడం జరిగింది. 1753లో లిన్నేయస్ చేత సైన్స్ కోసం ఈ జాతులు వర్ణించబడ్డాయి. మామిడి భారతదేశం, [[ఫిలిప్పీన్స్]] మరియు [[పాకిస్తాన్]] యొక్క జాతీయ పండు. [[క్రీస్తుశకం]] 4వ శతాబ్దంలో సంస్కృత కవి [[కాళిదాసు]] తను రచించిన పాటలలో ఈ మామిడిని గురించి వివరించాడు. దీని కంటే ముందు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అలెగ్జాండర్ ఈ పండును రుచి చూసినట్లుగా భావిస్తున్నారు. తరువాత చైనా తీర్థయాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ క్రీస్తుశకం 7వ శతాబ్దంలో ఈ మామిడి పండును రుచి చూసినట్లుగా భావిస్తున్నారు. తరువాత 16 వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి [[అక్బర్]] [[బీహార్]] లోని దర్భాంగాలో లక్ష మామిడి చెట్లను నాటించాడు. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని లాఖీ బాగ్ గా పిలుస్తారు.
 
==ఔషధ లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/భారతీయ_మామిడి" నుండి వెలికితీశారు