అల్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
అల్లం ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది ..ఇది మంచి ఔషధంగా కూడా పని చేస్తుంది. ఇది భారతదేశం మరియు చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీనిగురించి ప్రస్థావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లంను కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు. చాలామందికి ప్రయాణాల్లో వాంతులు మహా ఇబ్బంది పెడుతుంటాయి. వీటిని అల్లంతో అరికట్టవచ్చంటున్నారు ఆయుర్వేద వైద్యులు. అల్లం నోటి దుర్వాసనను పోగోడుతుంది. అల్లం నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాలను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం అల్లానికి ఉంది. అల్లం ప్రభావం కాలేయం మీద ఉంటుంది. కొలెస్టరాల్ నియంత్రణలో మెరుగైన పాత్ర వహించేలా కాలేయాన్ని తయారు చేయడమే అల్లం నిర్వహించే పాత్ర. రక్త నాళాల్లో రక్తప్రవాహం మెరుగుపరుస్తుంది. నాళాలు మూసుకుపోవడం జరుగదు. కీళ్లవారు, ఆస్త్మాల నుండి ఉపశమనం అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం, చిటికెడు ఉప్పును భోజనానికి ముందుగానీ, తర్వాతగానీ తీసుకుంటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది. సులభ విరోచనకారి కూడా. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.
==లక్షణాలు==
# ఈ మొక్క వార్షికంగా పెరుగుతుంది.ఇది ఒక హెర్బ్ నిత్యం ఒక మీటర్ పొడవు పెరుగుతుంది.కాండం ఇరుకుగా ఉండి ఆకుపచ్చ ఆకులు మరియు పసుపు పువ్వులు కలిగి ఉంటాయి.అల్లం పసుపు పువ్వులు,తెలుపు మరియు పింక్ రంగులు కలిగి ఉంటాయి.కాండం 3 నుండి 4 అడుగుల వరకు ఉంటుంది.ఎండిన నేలలో వొచ్చే ఎక్కువ పోషకాలను అందిస్తుంది.లేత అల్లం భూగర్భ చాలా తేలికపాటి రుచి తో జ్యుసిగా మరియు కండగా ఉంటుంది.ప్రౌఢ అల్లం భూగర్భ నుండి తీస్తారు దాదాపు పొడిగా ఉంటుంది.
*# కొమ్మువంటి భూగర్భ కాండంతో పెరిగే గుల్మము.
*# దీర్ఘవృత్తాకార-భల్లాకార సరళ పత్రాలు.
*# కంకి పుష్పవిన్యాసంలో అమరిన పసుపు రంగు పుష్పాలు. శొంఠి ఏండ పెట్టిన అల్లంను శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు.
 
==అల్లం ఉపయోగాలు:==
* మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం
"https://te.wikipedia.org/wiki/అల్లం" నుండి వెలికితీశారు