"భారతీయ జనసంఘ్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
:[[1927]]లో [[కరాచి]]లో జన్మించిన అద్వానీ చిన్న తనంలోనే ఆర్.ఎస్.ఎస్. పట్ల ఆకర్షితుడైనాడు. [[మహాత్మా గాంధీ]] హత్యానంతరం అనేక ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలలో పాటు అద్వానీ కూడా అరెస్టు అయ్యాడు. ఆ తరువాత శ్యాంప్రసాద్ నేతృత్వంలోని జనసంఘ పట్ల ఆకర్షితుడై ఆ పార్టీలో చేరి పలు పదవులు చేపట్టినాడు. 1977లో జనసంఘ్ పార్టీని జనతా పార్టీలో విలీనం చేయబడటంతో ఎన్నికలలో విజయం సాధించిన జనతా ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖను నిర్వహించినాడు. జనతా పార్టీ విచ్ఛిన్నం అనతరం 1980లో బయటకు వచ్చి జనసంఘ్ నేతలు భారతీయ జనతా పార్టీని స్థాపించడంతో అద్వానీ కూడా భారతీయ జనతా పార్టీలో వ్యవస్థాపక నేతగా చేరి పార్టీలో మంచి గుర్తింపు పొందినారు. 1989 తరువాత భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కృషిచేసి పార్టీ అధ్యక్ష పదవిని పొందడంతో పాటు కేంద్రంలో ఏర్పడిన అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వత్రించినాడు.
 
'''ఆచార్య బలరాజ్ మధోక్ :'''
ఆచార్య బలరాజ్ మధోక్ : స్వతంత్ర భారతదేశంలో విలక్షణమైన రాజకీయ, ఆర్థిక సైద్ధాంతిక భూమిక ఏర్పడటం కోసం విశేషంగా పోరాడిన, కోట్లాది మంది యువతను దేశభక్తి భావనతో ఉర్రూతలూగించిన, నేడు ఢిల్లీలో అధికారంలో ఉండిన భారతీయ జనతాపార్టీకి సైద్ధాంతిక పునాది ఏర్పరచిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులు ఆచార్య బలరాజ్ మధోక్ మే 2న ఢిల్లీలో మృతి చెందారు. నమ్మిన విలువలు, ఆదర్శాలకోసం రాజీలేని పోరాటాలు జరిపిన ఆయన రాజకీయంగా గత మూడున్నర దశాబ్దాలుగా తెరమరుగు కావలసి వచ్చింది. అయినా భారతదేశ సమగ్రతకు, అభివృద్ధికి ఆయన అందించిన సేవలు మరువరానివి.
== శీర్షిక పాఠ్యం ==

ప్రస్తుతం పాక్ ఆక్రమణలో ఉన్న స్కర్దులో 1920, ఫిబ్రవరి 25న జన్మించిన ఆయన శ్రీనగర్, లాహోరుల్లో చదువుకున్నారు. 1940లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి 1942లో ప్రచారక్‌గా వెళ్లారు. జమ్మూకశ్మీర్‌లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఆయనను రాష్ట్రం నుంచి బహిష్కరించడానికి ఒక దశలో షేక్ అబ్దుల్లా ప్రయత్నించాడు. జమ్మూలో ప్రజాపరిషత్ స్థాపకులలో ఒకరైన ఆయన 1949లో ఢిల్లీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ను ప్రారంభించడంలో క్రియాశీలకంగా వ్యవహరించి, వ్యవస్థాపక కార్యదర్శిగా పనిచేశారు. 1921లో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరిగా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ ఢిల్లీలో జరిపిన మొదటి సదస్సుకు కన్వీనర్‌గా ఉన్నారు. ఇద్దరు ఉద్దండులైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ, పండిత దీన దయాళ్ ఉపాధ్యాయలతో కలిసి పనిచేశారు. వారిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం గమనార్హం.
జనసంఘ్‌కు విలక్షణమైన రాజకీయ, ఆర్థిక, సైద్ధాంతిక భూమికను ఏర్పరచడం కోసం ప్రయత్నించారు. పార్టీ మొదటి ఎన్నికల ప్రణాళికను ఆయన తయారుచేశారు. రెండుసార్లు ఢిల్లీనుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జనసంఘ్ లోక్‌సభలో అత్యధిక సంఖ్యలో 35 స్థానాలు గెలుచుకొని వివిధ రాష్ట్రాల్లో బలమైన పార్టీగా ఎదిగింది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1876418" నుండి వెలికితీశారు