ధనియాలు: కూర్పుల మధ్య తేడాలు

కొరియాడ్రం సటైవం వ్యాస విలీనం
పంక్తి 20:
'''ధనియాలు''' ఒక విధమైన వంటలో ఉపయోగించే గింజలు. వీటిని కొరియాడ్రం సటైవం; దీనిని మరో రకంగా సీలెంట్రో అని కూడా అంటారు ముఖ్యంగా ఆమెరికా దేశంలో పిలుస్తారు. ఈ మొక్కలు ఎక్కువగా మధ్యధరా దేశాల్లో కనిపించే వార్షిక మొక్క.ఉష్ణోగ్రత తగినంత వేడి ఉన్న ప్రదేశాలలో పెరగడం ఇష్టపడతాయి. ఈ మొక్కలు మంచి సువాసన కలిగి ఉంటాయి.ఇవి పెరిగె ప్రదేశాల నుండి కొన్ని మీటర్ల దూరం వరకు సువాసన వెదజల్లుతుంది. కాండం 3 అడుగుల పొడవ వరకు ఉండవచ్చు.కాండం సన్నగా వుండి ఆకులతో వుంటుంది.కొమ్మల దగ్గర పువ్వులు గుంపుగా ఉండి ఊదా రంగులో ఉంటాయి.
==ధనియాలు==
ధనియాలను ఇంగ్లీష్‌లో కొరియాండర్ అనీ, ల్యాటిన్‌లో కొరియాండ్రమ్ సెటైవం అనీ పిలుస్తారు. సాధారణంగా ధనియాలను సుగంధంకోసం వంటల్లో వాడుతుంటారు. ధనియాల గింజలను కూరపొడి, సాంబారు పొడి తయారీలకు, కూరల తాళింపుకోసం వాడటం ఆనవాయితి.
* అయితే కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు.
* ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్‌గా (గ్యాస్‌నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది. అలాగే రిఫ్రిజిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది.
* ధనియాల నుంచి తీసిన తైలం బ్యాక్టీరియాను, వివిధ సూక్ష్మక్రిముల లార్వాలను అంతమొందించినట్లు పరిశోదనల్లో తేలింది.
* ఇండియన్ హెర్బల్ ఫార్మకోపియా, జర్మన్ కమీషన్, బ్రిటీష్ హెర్బల్ ఫార్మకోపియా వంటివి ధనియాలను ఆకలి తగ్గిన సందర్భాల్లోనూ, డిస్పెస్పియా (ఆమ్లపిత్తం/ స్టమక్ అప్‌సెట్)లోనూ వాడవచ్చని సూచించాయి.
* యూనానీ వైద్య విధానంలో ధనియాలను రక్తంతో కూడిన మూల వ్యాధిలోనూ, కాళ్లుచేతుల్లో మంటల్లోనూ, తలనొప్పి, స్వప్నస్కలనాల్లోనూ వాడతారు. * ధనియాలను చైనా వైద్య విధానంలో మీజిల్స్, మధుమేహం, గ్యాస్ట్రోఎంటిరైటిస్ (విశూచిక), త్రేన్పులు వంటి సమస్యల్లో వాడుతారు.
* వివిధ రకాలైన రోగాలను తగ్గిస్తుంది కాబట్టి ఆయుర్వేదంలో ధనియాలను ‘కుస్తుంబురు’అనే పర్యాయపదంతో పిలుస్తారు. అలాగే ‘వితున్నక’అని మరో పర్యాయపదం కూడా దీనికి ఉంది. శరీరంలో మంటలను తగ్గించేది అని ఈ పదానికి అర్థం.
* ధనియాలతో రకరకాల ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి. ఉదాహరణకు ధాన్యకాది హిమం (అతి దప్పికను తగ్గించడానికి వాడతారు), గుడుచ్యాది క్వాథం (జ్వరంలో తాపాన్ని తగ్గించడానికి వాడతారు), అభయారిష్టం (మలబద్ధకం, అర్శమొలల వ్యాధిలో వాడతారు), లవణ భాస్కర చూర్ణం (కడుపునొప్పిలో అజీర్ణాన్ని తగ్గించడానికి వాడతారు)... ఈ ఔషధాల తయారీలో ధనియాలు ఒక ప్రధాన ద్రవ్యం.
* ధనియాల చూర్ణాన్ని 3-5గ్రాములు మోతాదులోనూ, ధనియాల హిమం (కోల్డ్ ఇన్‌ఫ్యూజన్) 20-30 మి.లీ. మోతాదులోనూ, ధనియాల కషాయాన్ని 50-100 మి.లీ. మోతాదులోనూ వాడాలి.
 
==ధనియాలు ఔషథోపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/ధనియాలు" నుండి వెలికితీశారు