బలరామ్ జాఖర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
'''బకరాం జక్కర్''' (23 ఆగష్టు 1923 – 3 ఫిబ్రవరి 2016) భారతదేశ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ గవర్నర్ గా తన సేవలనందించారు.
==బాల్య జీవితం-విద్య==
జక్కర్ [[పంజాబ్]] రాష్ట్రం లోని ఫజిల్కా జిల్లాలో పంకోసి గ్రామంలో [[ఆగష్టు 23]] [[1923]] న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పటోదేవి జక్కర్ మరియు చౌదరి రాజారాం జక్కర్. ఆయన కుమారుడూ సజ్జన్ కుమార్ జక్కర్ పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రిగానూ, చిన్న కుమారుడు సునీల్ జక్కర్ మార్చి 2012 న పంజాబ్ కు ప్రతిపక్ష నాయకునిగా యున్నారు. ఆయన ప్రాథమిక విద్యను గ్రామోథన్ విద్యాపీఠ్ సంగరియాలో స్వామి కేశవానంద జీ వద్ద నేర్చుకున్నారు. ఆయన కేశవానంద జీ కు ప్రియమైన శిష్యునిగా ఉండేవారు. ఆయన సంస్కృత భాషలో డిగ్రీని లాహోర్ నందలి ఫార్మ క్రిస్టియన్ కళాశాలలో 1945లో చేసారు. ఆయన అంగ్లం, పంజాబీ, ఉర్దూ, సంస్కృతం మరియు హిందీ భాషలలో ప్రావీణ్యత సంపాదించారు.
 
==రాజకీయ నాయకునిగా==
ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1972లో తొలిసారిగా పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977లో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1980లో ఫిరోజ్ పూర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొంది స్పీకర్ పదవిని అలంకరించారు. 1884లో రెండోసారీ ఎంపీగా గెలిచారు. ఏడు, ఎనిమిదవ లోక్ సభకు స్పీకర్ గా వ్యవహరించిన జక్కర్ అన్నేళ్లు ఆ పదవిలో కొనసాగిన తొలివ్యక్తి. ఆయన 1980 నుండి 1989 వరకు స్పీకర్ గా తన సేవలను అందించారు. ఆయన పార్లమెంటు గ్రంథాలయం, అధ్యయనం, డాక్యుమెంటేషన్ మరియు సమాచార సేవలను పార్లమెంటు సభ్యుల జ్ఞానాన్ని పెంపొందించుట కోసం ప్రవేశ పెట్టారు. ఆయన పార్లమెంటు మ్యూజియం ను కూడా స్థాపించారు. ఆయన కామన్‌వెల్త్ పార్లమెంటేరియన్ ఎక్జిక్యూటివ్ ఫోరం నకు ఆసియా నుండి మొదటి చైర్మన్ గా ఎన్నుకోబడ్డారు. ఆయన [[పి.వి.నరసింహారావు]] మంత్రివర్గంలో 1991 లో వ్యవసాయ మంత్రిగా ఉన్నారు. ఆయన జూన్ 30,2004 నుండి మే 30 2009 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు.<ref>{{cite web |url= http://164.100.47.132/LssNew/biodata_1_12/2755.htm|title=Official Webpage on Loksabha Website|publisher= National Informatics Centre, New Delhi}}</ref>
"https://te.wikipedia.org/wiki/బలరామ్_జాఖర్" నుండి వెలికితీశారు