"చాణక్యుడు" కూర్పుల మధ్య తేడాలు

4 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి
పాటలీపుత్రమును మహాపద్మనందుడు తన యెనమండ్రు కుమారుల సాయముతో పాలించుచుండెను. మహాపద్మునకు ఇళ, ముర యను ఇరువురు రాణులు గలరు. ఇళ యందు ఎనిమిదిమంది కుమారులు జనించిరి. మహాపద్మునితో గలిపి వీరిని నవనందు లని యాకాలమున బేర్కొనుచుండిరి. రెండవ భార్యయగు మురయందు జన్మించిన వాడు చంద్రగుప్తుడు. తేజశ్శాలియు బుద్ధిమంతుడు నగు చంద్రగుప్తునియెడ సవతియన్న లెనమండ్రును పగ బూని ఎలాగునైనా వానిని మట్టుపెట్ట జూచుచుండిరి. మహాపద్ముడు ముదుసలియగుట చేతను చంద్రగుప్తుడు మిగుల చిన్నవాడగుట చేతను, రాజ్యభారమంతయు ఎనమండ్రునందులకు కైవసమయ్యెను. చంద్రగుప్తుని మట్టు పెట్ట నెన్నియో కపటోపాయములను బన్నుచు నందులు దురాలోచనము అనేక విధముల బాదించు చుండిరి కడకు చంద్రగుప్తుడు పొట్టకూటికి కూడ కరవయ్యెను. చివరకు సత్రాధికారిగనుండి దీనుడై కాలము గడుపుచుండెను.
 
==నందులు చాణిఖ్యుడినిచాణక్యుడిని అవమానించుట==
నందులు మహామంత్రియు నేర్పరియునగు రాక్షసుని మాటలేవియును పాటింపక మిగుల స్వతంత్ర భావముతో వర్తించుచుండిరి. ఒకదినమున చాణక్యు డను యువకుడు పండితవతంసుడు నందరాజుల సభకువచ్చి అందు గల యొక యున్నతాసనమున నాసీనుడై యుండెను. నందు లచటకువచ్చి ఉత్తమ పీఠమునందున్న ఆపేదబాపని మిగుల తిరస్కారభావముతో జూచి సింహాసనమునుండి పడ లాగిరి. అమాత్యరాక్షసుం డిది అక్రమమనియు పండితులు పూజనీయులనియు బోధించెను కాని లాభములేకపోయెను. సిగముడి వీడ నున్న తాసనమునుండినున్నతాసనమునుండి లాగబడిన చాణక్యుడు నందులను కొపముతొ తేరి పాఱజూచి "ఓ నందాధము లారా! బహుజనమధ్యమునందు నన్నిటుల అవమానించితిరి. మిమ్మిటులే సింహాసనమునుండి లాగి మీతలలను నరికి గానీ మీచే నూడ దీయబడిన ఈ తలవెండ్రుకల ముడి వేసు కొనను" అని శపధము చేసి సభామందిరమును వదలి వెడలిపోయెను.
 
చాణక్యుడిటుల గోపించి పోవుటజూచిన చంద్రగుప్తుడు మాఱుత్రోవను బోయి యొక యేకాంత ప్రదేశమున జాణక్యుని గలిసికొని సాగిలి పడి నమస్కరించి నందాదులచే దానొందు నవస్థలను దెలిపి తన్నను గ్రహింపుమని వేడుకొనెను. చంద్రగుప్తుని లేవనెత్తి చాణక్యు డాదరించి నందరాజ్యమునకు నిన్ను బట్టాభిషిక్తుని గావించుట నారెండవ ప్రతిజ్ఞయని చెప్పి, నాడు మొదలు చంద్రగుప్తుని తనయొద్దనే యుంచుకొని నందకుల నిర్మూలమునకై ప్రయత్నములు చేయుచుండెను.
చాణక్యుడు తన మిత్రుడును సహాధ్యాయయు నగు నిందుశర్మను సమీపించి తన ప్రతిజ్ఞను దెలిపి ఎలాగునైనా క్షపణక వేషముతో అభిచారిక విద్యచే నందులను, రాక్షసుని లోగొని యచటి రహస్యములను చారులచే నెఱింగించుచు, జంద్రగుప్తునకు నందరాజ్యమును ధారవోయుటకు దోడ్పడ వసినదిగా కోరెను.
 
ఇందుశర్మ యంగీకరించి నందుల చెంతకేగి చెలిమిగడించి రాక్షసుని చెంత బ్రాపకము నార్జించి తలలో నాలుకవలె గలిసిమెలసి యుండి రాజ్యరహస్యము లన్నియు నెప్పటికప్పుడు చాణక్యున కెఱింగించుచుండెను. చాణక్యుడు చంద్రగుప్తుని వెంటగొని హిమాలయపర్వత ప్రాంతమునందున్న యరణ్య భాగములను బాలించుపర్వతరాజు చెంత జేరి యతని స్నేహమును సంపాదించి నందులను చంపుటకు కాతనిఅతనిని బ్రోత్సహించెను. గెలిచిన యెడల నందరాజ్యమునందు సగము పర్వతరాజునకొసంగుటకు గూడ జాణక్యుడు వాగ్దానము గావించెను. జయించితిమేని జాణక్యుని జంద్రగుప్తుని వంచించి నందరాజ్యము నంతయు హరింప వచ్చునని పర్వతరాజు తలంచి సామంతుల యొద్దనుండి మిత్రుల యొద్దనుండి యసంఖ్యాకమగు సైన్యమును రప్పించి చాణక్యుడు పెట్టిన సంమూర్తమునసుమూర్తమున నందరాజ్యముపైకి దాడికి వెడలెను. పర్వతరాజు వెంట నాతని సైన్యమె కాక శక, యవన కిరాత, కాంభోజ, పారసీక, బాహ్లి కాది సైన్యములుగూడ వచ్చెను. చాణక్యుడు, చంద్రగుప్తుడు సైన్యమును మూడు భాగములుగా భాగించి తాము చెరియొక భాగమును దీసికొని గండకీ ప్రాంతమునకు బోయి పాటలీపుత్రమును ముట్టడించిరి. పర్వతరాజు కడమ మూడవభాగమును వెంటగొని గంగా శోణా సంగమప్రదేశము చెంత పాటలీపుత్రమును ముట్టడించెను. ఇందుశర్మ నందులనందరిని జీలదీసి చాణక్యునకు బట్టియిచ్చెను. చాణక్యుడు ఎనమండ్రు నందులను సంహరించి తన మొదటిప్రతిజ్ఞను నిర్వహించి యప్పుడు తల వెండ్రుకలను ముడివైచికొనెను.
 
నందుల నాశము జూచి మంత్రియగు రాక్షసుడు చీలిన సైన్యమునంతయు సమైఖ్య బఱచిసమైక్యబఱచి పర్వతరాజు సైన్యముతో బాటలీపుత్రసైన్యమును భయంకరముగా యుద్ధము జేయించెను. నందరాజులమరణము విన్న రాక్షసుల సైన్యము కొంతసేపటికి బర్వతరాజు సైన్యమునకు లొంగిపోయెను. పాటలీపుత్రమునందు అమాత్య రాక్షసున కెక్కువ పలుకుబడి యుండుటచేతను వెంటనే రాజ్యమున బ్రవేశించినచో జంద్రగుప్తునకైనను దనకైనను నపాయము గలుగవచ్చుననియు బర్వతరాజు నందరాజ్యమంతయు దానే వశపరచుకొను నేమో యనియు సందేహించి చాణుక్యుడు జయించిన రాజ్యమున బ్రవేశింప నగరము వెలుపల పరిజనముతో విడిసి యుండెను.
 
రాక్షసుడు ఎలాగైనా జంద్రగుప్తుని, జాణక్యుని జంప దలంచి మాయోపాయములు తప్ప వేఱు మార్గము లేదని, యొక యుపాయము పన్నెను. రాక్షసు డొకబాలికను విషము అలవాటు చేసి పెంచుచుండెను. ఆబాలిక విషము జీర్ణించుకొనుట కలవాటుపడి యౌవనవతియై సర్వాంగసుందరియై యుండెను. ఆసుందరి తాకినయెడ విషముసోకి మనుజులు మరణింతురు. ఆమెను రప్పించి తనచెంత విశ్వాసపాత్రుని వలె క్షపణక వేషథారియై వర్తించుచు జీవసిద్ధియను పేరుతోనున్న ఇందుశర్మను బిలిచి యీబాలికను జంద్రగుప్తునకు నేను సమర్పించితి ననియు బరిగ్రహించి మమ్ముల ననుగ్రహింపు మనియు జెప్పి పంపెను. జీవసిద్ధి విసకన్యనువిషకన్యను వెంటగొని చాణక్యునికడకు బోయి జరిగిన యుదంత మంతయు రహస్యముగా దెలిపి విషకన్యను సమర్పించెను. నందరాజ్యము నంతయు హరింపనెంచిన పర్వతరాజును జంప నిదియ తరుణమని చాణక్యుడు విషకన్యను బర్వతరాజునొద్దకు బంపెను. కామాతురుడగు పర్వతరాజు విషకన్యనుజూడగనే యొడలుప్పొంగి కౌగిలించుకొని విషము తల కెక్కి మరణించెను. నందరాజ్యమునంతయు హరింపదలంచిన పర్వతేశ్వరుడు గతించుట చాణక్యుని సంకల్పమునకు సర్వవిధముల సహాయకారి యయ్యెను. పర్వతరాజు మరణము విని యతని కుమారుడగు మలయ కేతువు విచారపడుచుండ బ్రతిపక్షుల సేనానయకుడగుసేనానాయకుడగు భాగురాయణుడు వచ్చి చెలిమి సంపాదించుకొని, చాణక్యుడు నీతండ్రిని జంపించినటులె నిన్నును జంపింప నున్నాడని బ్రదుక దలచిన నిటనుండి వెడలిపోవుట మంచిదని తెల్పెను. అతని మోసపుమాటలు నమ్మి మలయ కేతువు భాగురాయణుని మంత్రిగ జేసికొని తన పర్వత రాజ్యమునకు వెడలిపోయెను.
 
పర్వతరాజపర్వతరాజు మరణించుట, మలయకేతువు పాఱిపోవుటయు జూచి యిదియె మంచి సమయమని చాణక్య చంద్రగుప్తులు మంగళవాద్యములతో బాటలీపుత్రమున బ్రవేశించిరి. రాక్షసుడు సైన్యముల బ్రోత్సాహపఱచి చాణక్య చంద్రగుప్తుల బలము మీదికి యుద్ధమునకు ఉసి గొల్పెను. ఉభయులకు భయంకరమగు యుద్ధము జరిగెను. రాక్షసుడు ఈ యదును గనిపెట్టి నందులపక్షమున జేరి, చంద్రగుప్తునకు బట్టాభిషేకము చేయరాదని చాటించెను. మహానందుని ఒక సురంగసొరంగ మార్గమున దపము జేసికొనుటకు బంపి యతని స్వీకారపుత్రుని రాజ్యమునందు బ్రతిష్ఠింపవలయునని రాక్షసుడు నిశ్చయించెను. చంద్రగుప్త చాణక్యులు పాటలీపుత్రమున బరిచయము సంపాదించుకొనిన కొలది తన కపకారము కలుగక తప్పదని రాక్షసుడు గర్భవతి యగు తన భార్యను పుత్రుని ప్రాణమిత్రుడగు చందనదాసుని యింట రహస్యముగా నుంఛెను. తన యంతరంగ మిత్రుడగు శకటదాసునకు గోశాగారమునందలి ధనము నంతయు నొసంగి నందుల పక్షమునకు సహాయముచేయు నేర్పాటు చేయించెను. అంతతో దృప్తినందక చంద్రగుప్తుని మట్టుపెట్టిన గాని చాణక్యుడు లొంగడని యమాత్యరాక్షసుడు తలంచి దారు వర్మయను శిల్పిని బిలిపించి చంద్రగుప్తుడు నగరమున జేరునపుడు ద్వారము కూలునటుల జేయుమనెను. ఏనుగు నెక్కి నపుడు చంద్రగుప్తుని చుఱకత్తితో బొడిచి చంపుమని మావటీనిని బ్రోత్సహించెను. రాజవైద్యునితో జంద్రగుప్తునకు విషప్రయోగము చేయుమనియు, శయనాధికారితో నిదురించునపుడు తలనఱకు మనియు గొందఱు ఘాతుకులను గోడ సందులలో బంధించి సమయము జూచి చంపుమనియు రాక్షసుడు కట్టుదిట్టములు చేసెను. చాణక్యుడు తన యసాధారణ ప్రజ్ఞచే రాక్షసుని మాయోపాయము లన్నియు గమనించి చంద్రగుప్తున కెట్టి యపాయము గలుగకుండ గాపాడి హంతకుల నందఱ జంపించెను. సర్వార్థసిద్ధిని వెదకించి చాణక్యుడు కొందఱు హంతకుల బంపి చంపునటుల జేసెను. తన ప్రయత్నము లన్నియు విఫలమగుటయు బర్వతరాజు, సర్వార్థసిద్ధి మరణించుటయు మలయ కేతువు పాఱిపోవుటయు జూచి రాక్షసుడు తానిక బాటలీపుత్రమున నుండ లాభములేదని సురంగమార్గమునసొరంగమార్గమున నగరుదాటి పర్వతరాజ్యమునకు పారి పోయెను. ఇట్లు రాక్షసుడు మలయ కేతువు నొద్దకేగి యతనితో చాణక్యుడె నీతండ్రియగు పర్వతరాజును జంపించెననియు బాటలీపుత్రమును ముట్టడించి తండ్రిని జంపిన పగ దీర్చు కొమ్మనియు బ్రోత్సహించెను. మలయ కేతువునకు శక, గాంధార, యవన, శచీన, హూణాదిరాజులు సైన్యసహితముగా సాయము రానుండిరి.
 
చంద్రగుప్తుని బట్టాభిషిక్తుని జేయుటతో తనభారము తీరలేదని చాణక్యుడు తలంచి తన యంతరంగ మిత్రుడగు జీవసిద్ధిని బిలువనంపి నీవు విషకన్యను బ్రయోగించి పర్వతరాజును జంపితివి గాన రాజ్యమునం దుండదగవని వెడల నంపెను. ఈయవకాశమును బురస్కరించుకొని జీవసిద్ధి మలయ కేతువును శరణుగోరి రాక్షసునకు మలయ కేతువునకు విరోదము కలుగజేయుచు విషకన్యను బ్రయోగించి రాక్షసుడె పర్వతరాజును జంపెనను ప్రవాదము నందందు గలుగ జేసెను. జీవసిద్ధి యవకాశమున్నపుడెల్ల నచటి రహస్యములు చాణక్యాదులకు గూడచారులచే దెలియబఱచుచు బయటికి మలయ కేతువు పక్షమువానివలె నటించుచుండెను. చాణక్యుడు పాటలీపుత్రమున రాక్షసుని పక్షము వారెటనుండిరొ తెలిసికొనుటకు జారులను నియోగింప వారు వెదకి వెదకి చందనదాసుని యింటిలో రాక్షసుని భార్యయు బిడ్డలు నుండిరని తెలిసి కపటో పాయములతో తామార్జించిన రాక్షసుని ముద్రికను జాణక్యున కొసంగిరి. చాణక్యు డాముద్రికా సహాయమున గొన్ని పత్రికలను సృష్టించి జీవసిద్ధి చేతికిచ్చి ప్రచారము లోనికి దెప్పించి, రాక్షసునకు మలయ కేతువునకు విరోధము కలుగు నటుల జేసెను. అందుచే మలయ కేతువు నిశ్చయించిన దాదియు విఫలమయ్యెను. రాక్షసునకు మలయకేతువు నొద్ద ప్రాపకము తగ్గెను. తనతండ్రిని రాక్షసుడే చంపెనని మలయ కేతువు ద్వేషముగూడ వహించెను. 'మృతినొందిన నందాదుల యాత్మ శాంతికొఱకు జాణక్యుని గాని చంద్రగుప్తుని గాని సాధింపలేక పోతినిగదా, నేను జీవించి ఫలమేమని రాక్షసుడు పరితపించు చుండెను. రాక్షసుని నెటులేని చంద్రగుప్తునకు మంత్రినిగా జేసిన బాగుండునని సర్వవిధముల జాణక్యుడు ప్రయత్నించెను గాని నందపక్షపాతియగు రాక్షసుడందుల కంగీకరింపక పోయెను.
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1878549" నుండి వెలికితీశారు