"చాణక్యుడు" కూర్పుల మధ్య తేడాలు

19 bytes added ,  5 సంవత్సరాల క్రితం
చి
ఇతడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చాణక్యుడి తండ్రి పేరు చణకుడు. ఆయన స్వయంగా అధ్యాపకుడు కావడం వల్ల విద్య యొక్క విలువ బాగా తెలుసు. తక్షశిల అప్పట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వ విద్యాలయం. చాణక్యుడు చిన్నవాడి గా ఉన్నప్పుడే వేదాలు చదవడం ప్రారంభించాడు.
 
==పాటలీపుత్ర ప్రస్థావనప్రస్తావన==
భరతఖండమునందలి దేశములన్నిటిలో మగధ మిగుల ప్రసిద్ధమైనది. మగధదేశము చిరకాలము వీరాధివీరులు, పరాక్రమశాలురు, ధర్మస్వరూపులు నగు రాజులకు రాజధానిగ నుండెను. పాండవులను శ్రీకృష్ణుని ఉఱ్ఱూతలూపిన వీరవతంసుడగు జరాసంధుని రాజధాని ఈ మగధదేశమందలి గిరివ్రజము. దీనిచెంతనే బింబిసారుడు రాజగృహ మను నగరమును నిర్మించెను. తరువాత కొంతకాలమునకు అజాతశత్రుడు రాజ్యమునకువచ్చి గంగాతీరమునందున్న పాటలియను ఒక పల్లెచెంత గొప్ప దుర్గమును కట్టెను. అతని మనుమడగు ఉదయనుడు పాటలీదుర్గముచెంత పాటలీపుత్రమను గొప్పనగరము నిర్మించెను.
 
పాటలీపుత్రమును మహాపద్మనందుడు తన యెనమండ్రు కుమారుల సాయముతో పాలించుచుండెను. మహాపద్మునకు ఇళ, ముర యను ఇరువురు రాణులు గలరు. ఇళ యందు ఎనిమిదిమంది కుమారులు జనించిరి. మహాపద్మునితో గలిపి వీరిని నవనందు లని యాకాలమున బేర్కొనుచుండిరి. రెండవ భార్యయగు మురయందు జన్మించిన వాడు చంద్రగుప్తుడు. తేజశ్శాలియు బుద్ధిమంతుడు నగు చంద్రగుప్తునియెడ సవతియన్న లెనమండ్రును పగ బూని ఎలాగునైనా వానిని మట్టుపెట్ట జూచుచుండిరి. మహాపద్ముడు ముదుసలియగుట చేతను చంద్రగుప్తుడు మిగుల చిన్నవాడగుట చేతను, రాజ్యభారమంతయు ఎనమండ్రునందులకు కైవసమయ్యెను. చంద్రగుప్తుని మట్టు పెట్ట నెన్నియో కపటోపాయములను బన్నుచు నందులు దురాలోచనముదురాలోచనములు చేసి అనేక విధముల బాదించు చుండిరి కడకు చంద్రగుప్తుడు పొట్టకూటికి కూడ కరవయ్యెను. చివరకు సత్రాధికారిగనుండి దీనుడై కాలము గడుపుచుండెను.
 
==నందులు చాణక్యుడిని అవమానించుట==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1878550" నుండి వెలికితీశారు