ఆదిలాబాద్: కూర్పుల మధ్య తేడాలు

నవీకరించబడింది
పంక్తి 63:
'''ఆదిలాబాద్''' పట్టణం తెలంగాణాలోని అత్యంత ఉత్తరాగ్రంలో ఉన్న [[ఆదిలాబాదు జిల్లా]]కు జిల్లాకేంద్రం.<ref name="ఆదిలాబాద్ అధికారిక వెబ్సైట్">{{cite web|title=ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్|url=http://adilabad.nic.in/|website=ఆదిలాబాద్ జిల్లా అధికారిక వెబ్సైట్|publisher=తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం|accessdate=11 January 2015}}</ref> చారిత్రికంగా ఈ పట్టణానికి ఎదులాబాదు, ఆదిల్ షాబాద్ వంటి పేర్లు ఉండేవి, ప్రస్తుతం ఆదిలాబాద్‌గా జనవ్యవహారంలోనూ, అధికారికంగానూ పట్టణం పేరు స్థిరపడిపోయింది.
== పేరు వెనుక చరిత్ర ==
అదిలాబాదుకు ఈ పేరు ఎలా వచ్చిందన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలించిన బీజపూరు సుల్తాను అయిన '''మొహమ్మద్ అదిల్ షాహ్''' పేరు మీద వచ్చింది.<ref>[http://eenadu.net/district/inner.aspx?dsname=Adilabad&info=adbhistory ఈనాడులో ఆదిలాబాదు చరిత్ర ]</ref> మొహమ్మద్ అదిల్ షాహ్ తన ఆర్ధిక మంత్రి సేవలకు మెచ్చి ఆదిలాబాదు జిల్లా ప్రాంతాన్ని జాగీరుగా బహూకరించాడు. ఆర్ధికమంత్రి మొహమ్మద్ అదిల్ షాహ్ మీద కృతజ్ఞత చూపిస్తూ ఇక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి దానికి ''' ఆదిల్ షా బాద్''' అని నామకరణం చేసాడు. క్రమంగా అది ఆదిలాబాదుగా అభివృద్ధి చెందింది. మరో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఎద్దుల సంత జరిగేదని ఆ కారణంగా ఇది ఎదులాపురం అని పిలువబడేదని ముగలాయ్ పాలనా కాలంలో అది ఆదిలాబాదుగా మారిందన్నది భావించబడుతున్నది. తొలి తెలుగు యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన వివరాలు వ్రాస్తూ ఈ నగరాన్ని '''ఎదులాబాదు'''గానే ప్రస్తావించారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
 
== చరిత్ర ==
తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] తన కాశీయాత్రలో భాగంగా ఈ పట్టణాన్ని సందర్శించి 1830లో పట్టణం పరిస్థితులు తన కాశీయాత్రచరిత్రలో నమోదుచేశారు. పట్టణాన్ని యేదులాబాదుగా పేర్కొంటూ, ఇక్కడకు వచ్చే మార్గం ప్రమాదకరమైన అడవులతో నిండివుందన్నారు. పట్టణంలో అప్పటికే అన్ని పదార్థాలూ దొరికేవని, అన్ని పనులు చేసే పనివారూ ఉన్నారని కాశీయాత్రచరిత్ర ద్వారా తెలుస్తోంది. ఊరివెలుపల ఒక బ్రహ్మచారులు, సన్యాసుల మఠం, ఊళ్ళో మరికొన్ని మఠాలు ఉండేవని వ్రాశారు. [[ఇచ్చోడ|ఇచోడా]] మొదలుకొని వోణి అనే గ్రామం వరకూ ఆదిలాబాద్ సహా అప్పట్లో ముషోర్మల్క్ అనే దివాన్ పరిపాలనలో ఉండేది.<ref name="కాశీయాత్ర చరిత్ర"/>
"https://te.wikipedia.org/wiki/ఆదిలాబాద్" నుండి వెలికితీశారు