పోరుమామిళ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, ==గ్రామ భౌగోళికం==, ==గ్రామంలో విద్యా using AWB
→‎గ్రామ చరిత్ర: ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఆదివారం అనుబంధం నుండి సేకరణ
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
==గ్రామ చరిత్ర ==
మండలాలేర్పడకముందు [[బద్వేలు]] తాలుకాలో ఉన్న ఈ పట్టణం బద్వేలుకు ఉత్తరరాన 35 కిలోమీటర్ల దూరములో బద్వేలు - [[కంభం]] రాష్ట్ర రహదారిపై ఉన్నది. పట్టణానికి ఉత్తరము వైపున ఒక పెద్ద చెరువు ఉన్నది. ఈ చెరువుకట్టపై ఉన్న భైరవస్వామి ఆలయానికెదురుగా రెండు శిలాశాసనాలు ఉన్నాయి. ఆ శాసనాల్లో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] చక్రవర్తి, [[మొదటి హరిహర రాయలు]] మరియు [[మొదటి బుక్కరాయలు]] కాలములో అతని కుమారుడు భాస్కర రాయుడు [[ఉదయగిరి]] మండలాధిపతిగా రాజ్యము చేస్తూ ఆ చెరువును కట్టించాడని పేర్కొనబడింది.<ref>ఆంధ్ర సర్వస్వము - మాగంటి బాపినీడు (1942) పేజీ.526</ref>
 
 
పోరుమామిళ్ల చెరువు - చరిత్ర :
 
పోరుమామిళ్ల చెరువుకు చరిత్రలో ఆనంతరాజ సాగరామని పేరు.చెరువు కట్ట పైన భైరవుని గుడి ముందు ,రెండు ముక్కలుగా పడి ఉన్న శాసనం ప్రత్యేకమైనది .చెరువు నిర్మాణం కు సంబంధించిన అనేక సాంకేతిక,ఆర్థిక విషయాలను ఇది వెల్లడిస్తుంది.
క్రీ.శ.1369,అక్టోబర్ 15వ తేదీన విజయనగర ప్రభువైన మొదటి బుక్కరాయలు కుమారుడు భాస్కరుడు(భవదూరుడు) ఉదయగిరి రాజ్యానికి అధిపతిగా ఉన్నపుడు వేయించిన పోరుమామిళ్ల శాసనాన్ని 1903వ సంవర్సరంలో నకలు తీసిన శాసన పరిశోధకులు, దాన్లో విషయాలు చూసి విస్తుబోయారు.మొదటి బుక్కరాయుని మంత్రి ఆనంతరాజని,ఈ చెరువుకు కుమారగిరినాథుని కొడుకైన(బహుశ భాస్కరుని) దేవరాజన్ ను అధికారిగా నియమించారని,అతడే చెరువు నిర్మాణ వ్యవహారాలు,జమాఖర్చులు చూసేవాడని ఉంది.ఈచెరువు పూర్తయిన తర్వాత అనేకమంది బ్రాహ్మణులకు భూములు దానంగా ఇచ్చారని,నందపురానికి చెందిన లింగయ్య మాచనాచార్యుడు ఈ శాసనాన్ని రాశాడని పేర్కొనబడింది.పోరుమామిళ్ల గ్రామానికి తూర్పుగా 4 కీ. మీ. దూరాన ఉన్న ఈ చెరువు కట్ట 11 కీ. మీ.పొడవు ,13 మీ. వెడల్పు 12 మీ. ఎత్తు కలిగి ఉందనీ, ఆ కట్టలో నాలుగు చిన్న కొండలు, మూడు మట్టి కట్టలు ఉన్నాయని ,లోపల కడప రాళ్లతో బిగించబడిఉందనీ పేర్కొన్నారు.చెరువు కట్ట కింది భాగం 150 అడుగుల వెడల్పుతో దృఢంగా నిర్మించబడింది.పక్కనే ప్రవహిస్తున్న మల్దేవి అనే వాగుతో చెరువు ఎప్పుడూ నిండి నిజంగా సముద్రాన్ని తలపిస్తుంది.
ఆనంతరాజ సాగరామని పిలువబడిన ఈచెరువు నిర్మాణానికి ప్రతిరోజు వెయ్యి మంది పనివాళ్ళు 100 ఎడ్లబండ్లు రెండేళ్లపాటు వాడారని ,అంటే 7,30,000 మంది 73,000 బళ్ళు, లెక్కలేనంత ధనాన్ని దీనికోసం వాడారని ఆ శాసనంలో ఉంది.
ఎలాంటి దోషాలు లేకుండా అనువైనచోట, నిపుణులచేత ,ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన ఈ ఆనంతరాజసాగర్ నిర్మాణం విశేషాలు.ఇప్పటికీ నీటిపారుదల శాఖ అధికారులకే కాక, అమాత్యులకు కూడా మార్గ దర్శనం చేస్తుందనటంలో సందేహం లేదు.
 
===సమీప గ్రామాలు===
"https://te.wikipedia.org/wiki/పోరుమామిళ్ల" నుండి వెలికితీశారు