బత్తుల కామాక్షమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలాలు చేర్చడమైనది.
పంక్తి 1:
[[దస్త్రం:బత్త్లుల కామాక్షమ్మ.jpeg|framed|కుడి]]
'''బత్తుల కామాక్షమ్మ''' (1886 - 1969) ప్రముఖ సంఘ సేవకురాలు.<ref>[http://thulika.net/?page_id=368 Authors and Translators]</ref>
==జీవిత విశేషాలు==
ఈమె [[రాజమండ్రి]]లో వెంకటరత్నం మరియు సీతాయమ్మ దంపతులకు జన్మించింది. ఈమెకు బాల్యంలోనే [[వైధవ్యం]] ప్రాప్తించగా తన జీవితాన్ని మానవ సేవకు అంకితం చేశారు. ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయము నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణురాలయ్యారు. ఈమె [[తీర్థయాత్రలు]] నిర్వహించి సుమారు 1200 కిలోమీటర్లు ప్రయాణించి బదరీ యాత్ర చేసారు. వీనిద్వారా దేశంలో ప్రబలంగా ఉన్న నిరక్షరాస్యతను గుర్తించారు. రాజమండ్రి కేంద్రంగా ఈమె విద్యావ్యాప్తికి మరియు స్త్రీల అభివృద్ధికి కృషిచేశారు. కాకినాడలో 1920లో ఆంధ్రదేశ వైశ్య స్త్రీలసదనము స్థాపించారు. ఈమె సాగించిన నిస్వార్థ సేవకు గాను 1941 సంవత్సరంలో [[గృహలక్ష్మి]] పత్రికవారు గృహలక్ష్మి స్వర్ణకంకణం పతకాన్ని ఇచ్చి సన్మానించారు. రాజమండ్రి పౌరులు ఈమెకు షష్టిపూర్తి సందర్భంగా గొప్ప ఉత్సవాన్ని జరిపి శ్రీ కామాక్షి విజయ సంచిన అనే పేరుతో ప్రచురించారు.<ref>[https://archive.org/stream/TeluguWomenWriters1950-1975AnalyticalStudy/TeluguWomenWriters1950-1975_djvu.txt Full text of "Telugu Women Writers, 1950-1975, analytical study"]</ref>
 
ఈమె 1969 ప్రాంతంలో పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/బత్తుల_కామాక్షమ్మ" నుండి వెలికితీశారు