నాచన సోమన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[నాచన సోమన]] 14వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి, తెలుగు సాహిత్యంలో ప్రాముఖ్యత పొందిన కవులలో ఒకరు. ఆయన [[ఉత్తర హరివంశం]] కావ్యాన్ని రచన చేశారు. విజయనగర సామ్రాజ్య పరిపాలకుడైన వీర బుక్కరాయలు నాచన సోమనకు పోషకునిగా వ్యవహరించారు.
== కాలం ==
నాచన సోమన తెలుగు సాహిత్యంలో [[తిక్కన]] యుగానికి చెందిన కవి. సోమన కాలాన్ని గురించి పరిశోధకుల్లో వాదోపవాదాలు జరిగాయి. విజయనగర చక్రవర్తి బుక్కరాయలు నాచన సోమనకు చేసిన దానశాసనం క్రీ.శ.1344 నాటిదని పరిశోధకులు నిర్ధారించడంతో నాచన సోమన కాలం 1300 నుంచి 1380ల మధ్యదని అంచనావేస్తున్నారు.<ref name="పద్యకవితా పరిచయం">{{cite book|last1=బేతవోలు|first1=రామబ్రహ్మం|authorlink1=బేతవోలు రామబ్రహ్మం|title=పద్యకవితా పరిచయం-1|date=జనవరి 2000|publisher=అప్పాజోస్యుల విస్సాభొట్ల ఫౌండేషన్|location=రాజమండ్రి|pages=120-152|edition=2|language=తెలుగు|chapter=నాచన సోమన-ఉత్తర హరివంశం (జనార్దనుని రాయబారం)}}</ref>
 
== రచనలు ==
నాచన సోమన రచించినవాటిలో ప్రఖ్యాతిపొందినది, ప్రస్తుతం లభిస్తున్నది [[ఉత్తర హరివంశం]] గ్రంథమే.
"https://te.wikipedia.org/wiki/నాచన_సోమన" నుండి వెలికితీశారు