శ్యామశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
==సంగీత జ్ఞానం==
{{కర్ణాటక సంగీతం}}
వీరు [[తెలుగు]] నందును, సంస్కృతమునందును పండితులు. తమ మేనమామ వద్ద సంగీత ఆరంభ పాఠములు అభ్యసించిరి. వీరు 18 వ యేట తలిదండ్రులతో తంజావూరు చేరుకొనిరి. అచట ఆంధ్ర పండితులైన సంగీత స్వామి అను సన్యాసి [[కాశీ]] నుండి దక్షిణ హిందూ యాత్రకు వచ్చి, అది చాతుర్మాసము గాన తంజావూరి లోనే ఆ నాలుగు నెలలు ఉండిపోయిరి. ఒక దినము శ్యామ శాస్త్రి గారి యింటిలో వారికి భిక్ష జరిగెను. భిక్ష జరిగిన వెనుక శాస్త్రి గారి తండ్రి తన కుమారుని ఆ సన్యాసి గారికి చూపి ఆశీర్వదింపగోరిరి. శ్యామశాస్త్రిని చూచిన వెంటనే అతడు గొప్ప పండితుడు కాగలడని సంగీతస్వామి తెలుసుకొనెను. అప్పటి నుండి సంగీత విద్య అభ్యసించిరి. తాళశాస్త్రము లోను, రాగ శాస్త్రములో అఖండ పండితుడైన సంగీతస్వామి వద్ద బాగుగా విద్యనభ్యసించిరి. చాతుర్మాసము కాగానే సంగీతస్వామి కాశీకి వెళ్ళునప్పుడు గాంధర్వ విద్యాగ్రంథముల నిచ్చి "నీవు సంగీత శాస్త్రమును సమగ్రంగా అభ్యసించితివి. తంజావూరు ఆస్థాన విధ్వాంసుడైన పచ్చి మిరియము ఆది అప్పయ్య గారి సంగీతమును తరచు విను చుండుము" అని చెప్పి వెడలిపోయిరి.
 
గురువాజ్ఞ ప్రకారమే శాస్త్రి గారు ఆది అప్పయ్య గారితో స్నేహము చేసికొని వారి గానమును తరచు వినుచుండిరి. అది అప్పయ్య గారికి శాస్త్రిగారనిన అపరిమిత ప్రేమ, భక్తియు నుండెడివి. ప్రేమతో "కామాక్షి" అని పిలుచుటయు కలదట.
"https://te.wikipedia.org/wiki/శ్యామశాస్త్రి" నుండి వెలికితీశారు