నార్ల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
*ఎన్.టి. రామారావు నార్లను సాంస్కృతిక వ్యవహారాల సలహా దారుగా నియమించారు.
*ఆంధ్రజ్యోతి యజమాని కె.ఎల్.ఎన్. ప్రసాద్ కు నార్లకు అభిప్రాయ భేదాలు వచ్చాయి.రాజీనామా చేశారు.ఆంధ్రజ్యోతి స్థాపనకు ప్రధాన కారకుడు నార్ల. ఆయన్ను చూచి చాలా మంది షేర్లు కొన్నారు. పత్రికను పైకి తేవడానికి నార్ల అనేక కొత్త వరవడులు ప్రవేశపెట్టారు.సంపాదకీయాలు టెలిప్రింటర్ ద్వారా పంపేవారు. ఆయన రాత ఒక పట్టాన అర్థం అయ్యేదికాదు. ఉడయవర్లు అనే జర్నలిస్టు తిప్పలు బడి రాసి పంపేవాడు.
*తరచు ఆదివారాలు [[హైదరాబాద్]] లో అబిడ్స్ ప్రాంతాన పేవ్ మెంట్స్ పై పాత పుస్తకాలు వెతికేవారు. ఆయనకు యీ అలవాటు మద్రాసులో మోర్ మార్కేట్ నుండి ఉంది.
*నార్ల ఎప్పుడూ ఏదొక రుగ్మతతో బాధపడుతుండేవారు. మధురాపుట్ అని కాలికి జబ్బు. గుండెపోటు రెండు సార్లు వచ్చింది. విపరీతంగా తాగే సిగరెట్లు అప్పటితో మానేశాడు. కొన్నాళ్ళు చెవుల్లో రొదతో సతమతమయ్యారు.
*ఆయనకు త్రిపురనేని రామస్వామి రచనా శైలి నచ్చలేదు. [[త్రిపురనేని గోపీచంద్]] కు ఆయనకూ పడలేదు. గోపీచంద్ ఆపదలో వున్నప్పుడు సహాయపడినా, విశ్వాసం లేదని నార్ల అనేవాడు. కాని గోపీచంద్ చనిపోయినప్పుడు “ఎంత గుండె గలవాడికీ గుండె పోటు” అంటూ గొప్ప సంపాదకీయం రాశారు.
*నార్ల దగ్గర వుద్యోగం చేసిన తిరుమల రామచంద్ర ఉద్యోగం పీకేశాడు.
*నార్ల ఏ రాజకీయ వాదినీ వదలలేదు. [[టంగుటూరి ప్రకాశం]], [[నీలం సంజీవరెడ్డి]], [[కళా వెంకటరావు]], [[కాసు బ్రహ్మానంద రెడ్డి]], [[ఎన్.జి. రంగా]] ఆయన కలానికి గురైన వారే. ఎన్.జి. రంగాపై ధ్వజం ఎత్తినప్పుడు, [[గోగినేని రంగనాయకులు]] అని పతాక శీర్షికలతో రోజూ ఆయన వార్తలు ప్రచురించేవారు. రంగా బాధపడ్డారు. అమ్మ నాన్న పెట్టిన పేరు వాడితే అంత గింజులాట దేనికి అని నార్ల అనేవాడు.