సూర్యకాంతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
 
==సినీ జీవితం==
మొదట జెమిని స్టూడియో నిర్మించిన [[చంద్రలేఖ]] సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 [[రూపాయి|రూపాయలు]] చేశారు. తరువాత [[ధర్మాంగద]] (1949)లో ఆమెది మూగవేషం. [[ధర్మాంగద]] టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత [[లీలా కుమారి]] సాయంతో మొదటిసారిగా [[నారద నారది]] సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకొందివిరమించు కొంది.
 
ఆ పరిస్థితిలో సహాయ నటిగా [[గృహప్రవేశం]] సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం [[సౌదామిని]] చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత [[సంసారం]] చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.
"https://te.wikipedia.org/wiki/సూర్యకాంతం" నుండి వెలికితీశారు