ఏ మాయ చేశావే: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (14) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
అంతా సాఫీగా జరుగుతుండగా పూరీ జగన్నాధ్ గోవాలో షూటింగ్ కి తన యూనిట్ తో కలిసి వెళ్తాడు. 45 రోజులు సాగే ఈ షూటింగ్ లో కార్తీక్ కూడా ఒక భాగం. షూటింగ్ జరుగుతుండగా జెస్సీ ఇంట్లో తన పెళ్ళి గురించి చర్చలు జరుగుతుంటాయి. దానితో భయపడిపోయి జెస్సీ కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. తను షూటింగ్ లో పాల్గొంటున్న లొకేషన్లలో సిగ్నల్స్ లేక పోవడం, దర్శకుడైన పూరీ జగన్నాధ్ సెట్స్ లో ఫోన్ల వాడకం నిషేదించడం వల్ల ఇప్పుడు మాట్లాడలేనని, తిరిగి వచ్చాక మాట్లాడుకుందామని ఫోన్ కట్ చేస్తాడు. దానితో జెస్సీ తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదనీ, తమ ఇద్దరి జీవిత లక్ష్యాలు వేరనీ చెప్పి కార్తీక్ తో విడిపోతుంది. తన తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం ఒప్పుకుని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందని తెలుసుకుని నివ్వెరబోతాడు కార్తీక్.
రెండేళ్ళ తర్వాత తనతో పాటు అసిస్టంట్ గా పనిచేసిన నందిని తనని ప్రేమిస్తున్నానై కార్తీక్ తో చెప్తుంది. ఇంకా జెస్సీని మర్చిపోని కార్తీక్ తన ప్రేమని సున్నితంగా తిరస్కరించి, స్నేహితునిగా మిగిలిపోతాడు. పూరీ జగన్నాధ్ దగ్గర పనిచేసిన తర్వాత తన ప్రేమ కథను సినిమాగా తెరకెక్కించాలని పూనుకుంటాడు కార్తీక్. ఇందుకోసం తన పాత్రకు ప్రముఖ తెలుగు నటుడు శింబును, జెస్సీ పాత్రకు ప్రముఖ నటి [[త్రిష]]ను ఎంచుకుని వారిచే ఒప్పిస్తాడు. పతాక సన్నివేశం లేకుండా చిత్రీకరణ జరుపుకుంటున్న ఆ సినిమాకి జెస్సీ అని పేరు పెడతాడు కార్తీక్. న్యూయార్క్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మళ్ళీ జెస్సీని కలుసుకుంటాడు కార్తీక్.
జెస్సీకి పెళ్ళైందని నమ్ముతున్న కార్తీక్ ఇంకా తను నిన్నే ప్రేమిస్తున్ననని జెస్సీతో చెప్పకనే చెప్తాడు కార్తీక్. కానీ జెస్సీ తనకి ఇంకా పెళ్ళి కాలేదనీ, కార్తీక్ తో తన పెళ్ళికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఆ పెళ్ళి ఆపుకుని, తన తల్లిదండ్రులకు దూరమయ్యానని చెప్తుంది. ఏం జరిగినా వారిద్దరూ పెళ్ళి చేసుకుని కలిసి బ్రతకాలని నిశ్చయించుకుని చర్చిలో, గుడిలో ఒకే రోజు పెళ్ళి చేసుకుంటారు. ఇద్దరూ కలిసి [[హైదరాబాద్]] లో జెస్సీ సినిమా చూస్తుండటంతో కథ సుఖాంతమౌతుంది.
==తారాగణం==
* ముఖ్య తారాగణం
పంక్తి 47:
** [[సుధీర్ బాబు]] - జెస్సీ అన్నయ్య
==సంగీతం==
ఏ మాయ చేశావే సినిమాకి [[ఏ.ఆర్.రెహ్మాన్]] గారు సంగీతం అందించగా [[అనంత శ్రీరామ్]], కళ్యాణీ మీనన్, కైతప్రం పాటలను రచించారు. గౌతమ్ మీనన్ రెహ్మాన్ ల తొలి కలయిక ఐన ఈ సినిమా పాటలు ఫిబ్రవరి 3, 2010న సోనీ మ్యూజిక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించాయి. ఎందరినుంచో ప్రశంసలందుకున్న ఏ.ఆర్.రెహ్మాన్ ఈ సినిమా ద్వారా తన తొలి [[తెలుగు]] ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రం యొక్క కలెక్టరు ఎడిషన్ నవంబర్ 13, 2010లో విడుదలైంది. అందులో 3 కొత్త పాటలను జతచేసారు. ఈ సినిమా పాటలనే [[హిందీ]], [[తమిళ]] వర్షన్లలో వాడారు. ఆయా భాషల్లో కూడా ఈ పాటలకు మంచి ఆదరణ లభించింది.
'''ఫిబ్రవరి 3, 2010న విడుదలైన పాటలు'''
{| class="wikitable" style="width:70%;"
"https://te.wikipedia.org/wiki/ఏ_మాయ_చేశావే" నుండి వెలికితీశారు