"రెండుజెళ్ళ సీత" కూర్పుల మధ్య తేడాలు

({{వేదిక|తెలుగు సినిమా}})
== ఇతివృత్తం ==
గోపి([[విజయ నరేష్]]), కృష్ణ(ప్రదీప్), మోహన్(రాజేష్), మూర్తి(శుభాకర్) నలుగురూ ఒకే కాలేజీలో, ఒకే రూములో, ఒకే మాటగా ఉండే స్నేహితులు. వీళ్ళ ఇళ్ళ ప్రాంగణంలోనే కొత్తగా సీత(మహాలక్ష్మి) అనే అందమైన అమ్మాయి తన కుటుంబంతో అద్దెకు దిగుతుంది. అక్కడి వరకూ ఒకే మాటగా సాగిన నలుగురి మధ్యా పోటీ మొదలవుతుంది. ఇది ముదిరి ఒకే రౌడీ చేతికి డబ్బిచ్చి నలుగురూ దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది. దాంతో రాజీపడి సీత దగ్గరకి వెళ్ళి తమలో ఎవరిని ప్రేమిస్తున్నావని అడుగుతారు. దాంతో సీత వీళ్ళకి తన గతాన్ని చెప్తుంది.<br />
మధు, సీత ప్రేమించుకుంటారు. మధు(కమలాకర్) తండ్రి గండభేరుండం([[అల్లు రామలింగయ్య]]) వీళ్ళ పెళ్ళికి రూ.2 లక్షల కట్నం అడుగుతాడు. స్కూలు మాస్టారైన సూర్యనారాయణ([[సాక్షి రంగారావు]]) అన్నిటికీ ఒప్పుకుంటాడు. పెళ్ళికి అంతా సిద్ధమైనప్పుడు లేనిపోని సాక్ష్యాలు కల్పించి, [[సీత]] మీద నిందమోపి ఆమె పెళ్ళిని రద్దుచేయిస్తాడు గండభేరుండం. ఆమె గతం విని కరిగిపోయిన నలుగురు స్నేహితులూ ఆమె పెళ్ళి జరిపించాలని నిర్ణయించుకుంటారు. విజయనగరం వెళ్ళి గండభేరుండం కూతురు కాత్యాయని(దేవి), కామేశ్వరరావు([[శుభలేఖ సుధాకర్]]) అనే కుర్రాడితో ప్రేమలో పడేలా చేస్తారు. మధు, సీతలను విడదీయడానికి ఫోటోలో తలలు మార్చి దొంగ సాక్ష్యాలను గండభేరుండం సృష్టించినట్టే కాత్యాయనిపైనా వీళ్ళు నలుగురూ నిందమోపుతారు. దాంతో గండభేరుండం తాను చేసిన తప్పుఒప్పుకుంటాడు. నలుగురు కుర్రాళ్ళూ మధు, సీతలను కలుపుతారు.
 
== నిర్మాణం ==
1,92,256

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1880771" నుండి వెలికితీశారు