కొమ్మూరు (కాకుమాను): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 108:
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మూకిరి మార్తమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ పీరా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామివారి దేవాలయం;- దాదాపు రెండు వేల సంవత్సరాలక్రితం, అగస్త్యమహాముని, ఓగేరు నది ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినారు. అందుకే ఈ ఆలయానికి "అగస్తేశ్వరస్వామి" దేవాలయం అని పేరు వచ్చినది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం, పైకి పెరుగుతుండటంతో ఒక బంగారు శీలను కొట్టినారని పూర్వీకులు చెప్పుకుంటుంటారు. ఆ తరువాత చోళరాజులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినారు. ఈ ఆలయ ముఖమండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినారు. సత్తెనపల్లి జమీందారులు, పలువురు ప్రముఖులు ఈ ఆలయానికి వందల ఎకరాల భూమిని దానంగా ఇచ్చినారు. ఈ అలయానికి జిల్లా నలుమూలలనుండి భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని పూజలు చేయుదురు. ఈ ఆలయంలోని స్వామివారిని పూజిస్తే నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలుగుతుందని స్థానికుల ప్రగాఢవిశ్వాసం. ఈ దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా, స్వామివారికి, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనెదరు. [4]&,[8]&[]
#శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 5.18 ఎకరాల మాన్యం భూమి ఉన్నది []
#శ్రీ భద్రకాళీసమేత ఉద్దండ వీరభద్రస్వామి ఆలయం:- ఈ ఆలయ 13వ వార్షికోత్సవం, 2016,ఫిబ్రవరి-13వ తేదీ మాఘమాసం, శుద్ధ పంచమి, శనివారంనాడు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణo కన్నులపండువగా నిర్వహించినారు. అనంతరం రాత్రికి గ్రామంలో ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించినారు. [9]
#శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయ నవమ వార్షికోత్సవం, 2016,ఫిబ్రవరి-12వ తేదీ మాఘ శుద్ధ చవితి, శుక్రవారంనాడు వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణo కన్నులపండువగా సాగినది. [9]
"https://te.wikipedia.org/wiki/కొమ్మూరు_(కాకుమాను)" నుండి వెలికితీశారు