దక్షిణ విజయపురి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 126:
#బుద్ధవనం:- ఇక్కడ కేంద్రప్రభుత్వ నిధులతో 279 ఎకరాల స్థలంలో "బుద్ధవనం" రూపుదిద్దుకొనబోవుచున్నది. బుద్ధవనంలో ధ్యానమందిరం, ప్రత్యేక ప్రార్ధనా మందిరం, మహా స్థూపం, 36 అడుగుల బుద్ధ విగ్రహం వంటి పలు అంశాలకు చెందిన చారిత్రిక ఘట్టాలను ఏర్పాటు చేయబోవుచున్నారు. అమెరికాలోని బౌద్ధుల కోసం, బుద్ధవనంలో 3 ఎకరాల స్థలం కేటాయించినారు. [5]
#శ్రీ సీతారామాలయం:- ఈ ఆలయాన్ని 1966 లో స్థాపించినారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా, 2015,నవంబరు-21వ తేదీనుండి 24వ తేదీ వరకు, 3 రోజులపాటు ఈ ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించినారు. ఆఖరిరోజైన 24వ తేదీనాడు శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించినారు. [12]
#శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ రంగనాథస్వామివారి ఆలయం:- ఇక్కడకు సమీపంలో ఉన్న '''అనుపు ''' లో ఉన్న ఈ పురాతన ఆలయంలో, 2016,మే-21వ తేదీ శనివారం, వైశాఖ పౌర్ణమినాడు, స్వామివారి కళ్యాణ వేడుకలను నయనానందకరంగా నిర్వహించినారు. ఈ ఉత్సవాలలో నూతన వధూవరుల జంటలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించినారు. మద్యాహ్నం ఆలయంలో భక్తులకు మహాన్నదానం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి సుదూరప్రంతాలనుండి గూడా అధికసంఖ్యలో పాల్గొన్నారు. [15]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయం స్థానిక టి.జంక్షను వద్ద ఉన్నది. [6]
#శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం సమీపంలో, 2014,డిసెంబరు-5వ తేదీనాడు, శ్రీ కాశినాయన విగ్రహ ప్రతిష్ట నిర్వహించెదరు, ఈ సందర్భంగా అక్కడ 5,6 తేదీలలో అన్నదానం నిర్వహించెదరు. [6]
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_విజయపురి" నుండి వెలికితీశారు