పి. బి. శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
ఆయన ఆంధ్ర పదేశ్ నందు [[తూర్పు గోదావరి జిల్లా]] లోని [[కాకినాడ]] పట్టణమునందు ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు [[సెప్టెంబర్ 22]] , 1930 న జన్మించాడు.<ref name="thehindu.com"/> ఆయన కళాశాల చదివి బి.కాం. డిగ్రీని సంపాదించాడు. ఆయన పూర్వీకులు [[పసలపూడి]] గ్రామానికి చెందినవారు.
 
ఆయన ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అవి [[తెలుగు]], [[కన్నడం]] , [[తమిళం]] , [[మళయాళం]] , [[హిందీ]] , [[ఉర్దూ]] , [[ఆంగ్లం]] , [[సంస్కృతం]]. ఆయన అనేక గజళ్ల ను తెలుగు లో పాడాడు. శ్రీనివాస్ యుగళ గీతాలను కోరస్ పాటలను [[గీతా దత్]], [[షంషాద్ బేగమ్]] మరియు [[జిక్కీజిక్కి]] లతో కలిసి ఆలపించారు. ఆయన [[ఆర్.నాగేంద్ర రావు]] యొక్క [[జాతక ఫలం]] అనే చిత్రం ద్వారా [[తమిళం]], [[కన్నడం]], [[తెలుగు]] చిత్రాల లో పరిచయమైనాడు<ref>[http://www.hindu.com/fr/2008/09/19/stories/2008091951110200.htm The Hindu : Music cannot thrive without rasikas]</ref>. ఆయన దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడాడు. తెలుగు చిత్రాల్లొ ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించాడు. [[శాంతినివాసం]] చిత్రం లో మహానటుడు నాగయ్య గారికి "శ్రీ రఘురాం జయ రఘురాం " అనే పాటను పాడటం విశేషం.
 
తండ్రిగారి సంస్కృతపండితులు కావటం వల్ల సంస్కృతం శ్రీనివాస్‌కి చిన్ననాడే అబ్బింది. ఫణీంద్రస్వామి కంటే తల్లి శేషగిరమ్మ దగ్గఱ చనువెక్కువ. తండ్రి క్రమశిక్షణకు పెట్టింది పేరు. తల్లి సంస్కృత విదుషీతల్లజ. కిడాంబి వారింటి ఆడపడుచు. ఆమెది కోయిల గొంతు. సంగీతకోవిద. గురువుల నుంచి శ్రీనివాస్ నేర్చుకొన్నదేమన్నా ఉంటే అది తల్లి నుంచే. ఆమే ఆయనకు ఆదిగురువు, తుది గురువు.
"https://te.wikipedia.org/wiki/పి._బి._శ్రీనివాస్" నుండి వెలికితీశారు