గూడవల్లి (చెరుకుపల్లి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 189:
గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టిన వీరు ఇంటరు వరకు, విద్యనభ్యసించి, ఆర్ధికభారంతో, కుటుంబ భారాన్ని మోయాలనే ఉద్దేశ్యంతో, 18 సంవత్సరాల వయసులోనే, 1986లో ఆర్మీలో చేరి, మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ లో బాధ్యతలు తీసికొన్నారు. ఈయనకు తొలిసారిగా 1996లో అంటార్కిటికా ఖండంలో పరిశోధనలకు వెళ్ళుచున్న శాస్త్రవేత్తల బృందానికి, "లాజిస్టిక్స్ సపోర్టరు" గా వెళ్ళే అవకాశం కలిగింది. రెండు శాతం కొండలు, 98 శాతం మఛుతో కప్పబడిన, జనసంచారం లేని మంచు ఎడారి అది. భారత ప్రభుత్వం వారు అక్కడ దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అను మూడు ఇండియన్ అంటార్కిటికా సైంటిఫిక్ స్టేషనులను ఏర్పాటుచేసినారు. పరిశోధనలలో ఆ శాస్త్రఙులకు కావలసిన సదుపాయాల కల్పనను చూడటం మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ వారి కర్తవ్యం. బుల్ డోజర్, క్రేన్, ఎస్కలేటర్ డ్రైవర్ గా అనుభవం ఉన్న మస్తాన్, ఆ ప్రతికూల వాతావరణంలో, శాస్త్రఙులు ఎక్కడ టవర్లు నిర్మించాలన్నా, అక్కడ అనుకున్న కాలానికి చేసిపెట్టేవారు. ఈ మంచుఖండంలో ఈయన 1996, 2008, 2010,2013 సంవత్సరాలలో, అత్యధికంగా మొత్తం 1990 రోజులు విధి నిర్వహణ చేసి, "లింకా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్" లో స్థానం సంపాదించుకున్నారు. [5]
==గ్రామ విశేషాలు==
ఈ గ్రామంలో శ్రీ రావి వెంకటరమణ డిగ్రీ చదివి వ్యవసాయం చేయుచున్నారు. వీరి భార్య శ్రీమతి కృష్ణకుమారి, బి.కాం. చదివి, గృహిణిగా ఉన్నారు. ఈ దంపతుల కుమార్తె లక్ష్మీ తేజస్వి, మే-2016లో ప్రకటించిన ఏ.పి. ఎం.సెట్ పరీక్షా ఫలితాలలో ఈమె బై.పి.సి. విభాగంలో రాష్ట్రస్థాయిలో 253వ ర్యాంక్ సాధించినది. [8]
 
[[బొమ్మ:VillagePhotos.jpg|thumb|నరసింహస్వామి దేవాలయము]]