ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
ఈ రైలు సికింద్రాబాదు నుండి విజయవాడకు WDP-4D (గూటీ షెడ్) ఇంజనుతో ప్రయాణించి విజయవాడ నుండి విశాఖపట్నం వరకు లాలాగూడా ఆధారిత WAP-7 ఇంజనును ఉపయోగించుతుంటుంది. తదుపరి విశాఖపట్నం నుండి హౌరా స్టేషన్ వరకు సంత్రాగచి ఆధారిత WAP-4 ఇంజనుతో ప్రయాణిస్తుంది.
==కొన్ని సంఘటనలు==
* అక్టోబరు 16, 2013 : విజయవాడ నుంచి సికింద్రాబాద్ బయలుదేరిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా మంగళగిరి వద్దకు రాగానే... రైలు బోగీలకు, ఇంజిన్ కు మధ్య లింక్ తెగిపోయింది. ఆ సమయంలో ఓ మలుపు వద్ద రైలు నెమ్మదిగా వెళుతోంది. దీంతో ఘోర ప్రమాదం తప్పింది. <ref>[http://www.ap7am.com/flash-news-19195-telugu.html#sthash.qul4F8mJ.dpuf
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు తప్పిన ఘోర ప్రమాదం]</ref>
* సెప్టెంబరు 22, 2015 : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ కు పెద్ద ముప్పు తప్పింది. ఆ రైల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన బాంబును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా లోని హౌరా రైల్వేస్టేషన్ లో ఈ రైలు ఆగి ఉన్న సమయంలో బాంబును గుర్తించారు.<ref>[http://www.sakshi.com/news/top-news/bomb-recovered-from-falaknuma-express-278433 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ లో బాంబు! Sakshi | Updated: September 23, 2015]</ref>