"క్రైస్తవ మతం" కూర్పుల మధ్య తేడాలు

1,184 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
==చరిత్ర==
ఆర్యుల వేద కాలంలో యూదుల మతము (Judaism) ఆవిర్భవించింది. బైబిలు పాత నిబంధనలో మొదటి ఐదు అధ్యాయాలైన ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయకాండము, ద్వితియోపదేశకాండము, సంఖ్యాకాండము వంటి పుస్తకాలు యూదులు (Jews)కు పవిత్రమైనవి. వీటిని ధర్మశాస్త్ర గ్రంధాలని యూదులు నమ్ముతారు. అయితే కాల క్రమేణా విగ్రహారాధన ఊపందుకొని యూదుల ఆచార వ్యవహారాలు చాలా మార్పులకు లోనయ్యాయి. నేడు హిందువులు తమ దేవతలని సంతృప్తి పరచడం కోసం జంతువులను బలి ఇస్తున్నట్లుగా ఆ కాలంలో యూదులు కూడా పాప పరిహారార్ధ జంతు బలులు అర్పించేవారు , కాలక్రమేణా యూదుల ఆచారాలు వెర్రి తలలు వేశాయి. ధనిక - పేద, యజమాని - బానిస వంటి అసమానతలు, వ్యాధి గ్రస్తుల పట్ల చిన్న చూపు, మూడ నమ్మకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ధర్మశాస్త్రాన్ని కాలానికి అనుగుణంగా సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
అయితే ఆర్యుల వేదకాలంనాటి పాత నిబంధనలో భాగమైన యోషయా గ్రంథం 7:14 లో "ఇదిగో ఒక కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయన ఇమ్మనుయేలు అని పిలుచును" అని యేసు క్రీస్తు గురించి పరోక్షంగా ప్రస్తావించడం విశేషం. మరియూ యోషయా 9:6 లో "ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును" అని కూడా వ్రాయబడియుంది.
 
యషయా గ్రంధం రచించబడిన 700 సంవత్సరాల తర్వాత యూదుల కులంలో [[కన్య]] మరియ, యేసేపు లకు [[యేసు క్రీస్తు]] జన్మించాడు. యేసు జన్మ గురించి క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 1:18-25, లూకా సువార్త 1:26 లో వ్రాయబడియున్నది. అయితే యేసు క్రీస్తు కాలానికి ఇశ్రాయేలు (Israel) దేశం అంతా రోమన్స్ (Romans) పరిపాలనలోకి వెళ్ళిపోయింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1884142" నుండి వెలికితీశారు