జగదీశ్ చంద్ర బోస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 22:
 
== జీవితం ==
ఆంగ్లేయుల సామ్రాజ్యంలోని [[బెంగాల్]] ప్రావిన్సు లో జన్మించిన బోసు [[కలకత్తా]] లోని సెయింట్ జేవియర్ కళాశాల నుంచి డిగ్రీ పుచ్చుకున్నాడు. తరువాత ఆయన వైద్య విద్య కోసం [[లండన్]] వెళ్ళాడు. కానీ ఆరోగ్య సమస్యల వలన చదువును కొనసాగించలేకపోయాడు. తిరిగి భారతదేశానికి వచ్చి కోల్‌కత లోని ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్ర ఆచార్యుడిగా చేరాడు. అక్కడ జాతి వివక్ష రాజ్యమేలుతున్నా, చాలినన్ని నిధులు, సరైన సౌకర్యాలు లేకపోయినా తన పరిశోధనను కొనసాగించాడు.
 
== పరిశోధనలు ==
ఈయన వైర్‌లెస్ సిగ్నలింగ్ పరిశోధనలో అద్భుతమైన ప్రగతిని సాధించాడు. రేడియో సిగ్నల్స్ ను గుర్తించడానికి అర్థవాహక జంక్షన్ లను మొట్టమొదటి సారిగా వాడింది జగదీశ్ చంద్రబోసే. కానీ తన పరిశోధనలను వ్యాపారాత్మక ప్రయోజనాలకు వాడుకోకుండా తన పరిశోధనల ఆధారంగా ఇతర శాస్త్రవేత్తల మరిన్ని ఆవిష్కరణలకు దారి తీయాలనే ఉద్దేశ్యంతో బహిర్గతం చేశాడు.
"https://te.wikipedia.org/wiki/జగదీశ్_చంద్ర_బోస్" నుండి వెలికితీశారు