గరుడ పురాణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
తిరిగి కర్మానుసారం జన్మించడం గురించిన వర్ణన విపులంగా చేయబడింది. జన్మ రాహిత్యం జ్ఞానులకు,పుణ్యాత్ములకు మాత్రమే కలుగుతుంది.పాపులు చావు గర్భవాసాన్ని బాధగా భరిస్తుంటాడు. తల్లి తిన్న పులుపు చేదు పదార్ధాల వలన వేదన పడతాడు. ఆ తరువాత పంజరంలో పక్షిలా కొద్ది రోజులకు క్రిందికి తిరుగుతాడు. గాద్గద స్వరంతో భగవంతుని స్తుతిస్తాడు. ఏడవ మాసానికి మరింత జ్ఞానోదయమై అటూఇటూ కదలుతూ గత జన్మలో పాపపుణ్యాలనుఎరుగక చేసిన పాపకార్యాలు తలచుకుని మరింత చింతిస్తాడు. తను అర్జించిన సంపదలను అనుభవించిన భార్యా బిడ్డలు తనను పట్టించుకోక పోవడం గుర్తుచేసుకుని రోదిస్తూ భగవంతుడా పుట్టుక సంసార బాధలు తప్పవు అని భావన.
 
పాపాత్ముడు పురుషుని రేతస్సుని ఆధారంగా చేసుకుని కర్మననుసరించి నిర్ధిష్టమైన స్త్రీ గర్భంలో ప్రవేసిస్తాడు. అలా ప్రవేసించిన అయిదు రోజులకు బుడగ ఆకారాన్ని పొందుతాడు.పది రోజులకు రేగుపండంత కఠిమైన ఎర్రని మాంసపు ముద్దలా తయారవుతాడు. ఒక మాసకాలానికి తలభాగం తయారవుతుంది.రెండు మాసాలకు చేతులు భుజాలు ఏర్పడతాయి.మూడు మాసాల కాలానికి చర్మం, రోమాలు, గోళ్ళు, లింగం, నవరంధ్రాలు ఏర్పడతాయి. ఐదవ మాసానికి ఆకలి దప్పిక వస్తాయి. ఆరవ మాసానికి మావి ఏర్పడి దక్షిణవైపుగా కదలిక మొదలౌతుంది. ఇలా మెల్లిగా తల్లి తీసుకునే ఆహారాన్ని స్వీకరిస్తూ పరిణితి చెందుతూ ఉంటుంది.జీవుడు దుర్గంధ భూయిష్టమైన ఈ గర్భకూపంనుండి నన్ను త్వరగా బయటకు త్రోసి వేయి తండ్రీ. మరో జన్మ ఎత్తి నీ పాదసేవ చేస్తాను నాకు మోక్షప్రాప్తిని కలిగించు అని పరి పరి విధాల ప్రార్ధిస్తాడు.ఇలా శోకించే శిశువు వాయుదేవుని సహాయంతో ఈ లోకంలో జన్మించి వెంటనే ముందున్న జ్ఞానం నశించి అజ్ఞానం ఆవరించి ఏడ్వటం మొదలు పెడతాడు.ఆ తర్వాత పరాధీనుడై తన ఇష్టాయిష్టాలు,శరీర బాధలు చెప్ప లేక బాల్యావస్థలు పడుతూ యవ్వనంలోకి ప్రవేశించి ఇంద్రియాలకు వశుడై ప్రవర్తించి పాపపుణ్యాలను మూట కట్టుకుని వృద్ధాప్యం సంతరించి తిరిగి మరణాన్ని పొందుతాడు. తిరిగి కర్మానుసారంగా గర్భవాసం చేసి మరొక జన్మను ఎతుత్తాడు. ఇలా జీవన చక్రంలో నిరంతరం జీవుడు మోక్షప్రాప్తి చెందే వరకు తిరుగుతూనే ఉంటాడని గరుడ పురాణం ఆరవ అధ్యాయం చెప్తుంది. ప
[[వర్గం:అష్టాదశ పురాణములు]]
[[వర్గం:పురాణాలు]]
"https://te.wikipedia.org/wiki/గరుడ_పురాణం" నుండి వెలికితీశారు