ముహమ్మద్ ఆలీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
'''మహమ్మద్ అలీ''' విశ్వ విఖ్యాత బాక్సర్. మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తిశాలి. ఇతని అసలు పేరు '''క్లాషియస్ క్లే'''. తరువాత ఇస్లాం మతాన్ని స్వీకరించి తనపేరును మార్చుకున్నాడు. ఇతని కూతురు '''లైలా అలీ''' కూడా మహిళా విభాగంలో ప్రపంచ విజేత. ఇతను కొన్ని చిత్రాలలో కూడా నటించాడు.
==జీవితవిశేషాలు==
ఇతడు [[1942]],[[జనవరి 17]]వ తేదీన కెంటకీలో జన్మించాడు. ఇతని అసలు పేరు కాసియస్ మార్సెలస్ క్లే జూనియర్. ఇతడు తన 12వ ఏట నుండి బాక్సింగ్ శిక్షణ పొందాడు. 1960లో రోమ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సంవత్సరం ప్రొఫెషనల్‌గా మారి 21 సంవత్సరాల పాటు బాక్సింగ్‌లో తిరుగులేని విజయాలను సాధించాడు. ఇతడు 1964లో ఇస్లాం మతం స్వీకరించి తన పేరును ముహమ్మద్ అలీగా మార్చుకున్నాడు. తాను ఆచరించిన ధర్మం కోసం నేరుగా అమెరికా ప్రభుత్వంతోనే తలపడ్డాడు. అప్పటి నిబంధనల ప్రకారం ఆలీ కూడా సైన్యంలో చేరి వియత్నాం యుద్ధానికి వెళ్లాల్సి ఉండగా తాను నమ్మిన ఇస్లాం అమాయకులను చంపనీయదంటూ సైన్యంలో చేరడానికి వ్యతిరేకించాడు.దానితో అమెరికా ప్రభుత్వం అతని హెవీవెయిట్ టైటిల్స్ అన్నీ రద్దు చేసి అరెస్ట్ కూడా చేసి జైలుకు పంపింది. దీనిపై కోర్టులో పోరాటం తర్వాత ఇతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇతడు 1964లో సోంజి రాయ్‌ను, 1967లో బెలిండా బాయ్డ్‌ను,1977లో వెరోనికా పోర్షేను వివాహం చేసుకుని వారికి విడాకులు ఇచ్చి 1986లో లోనీ విలియమ్స్‌ను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇతనికి తొమ్మిది మంది సంతానం. వీరిలో లైలా అలీ బాక్సర్ కాగా, హనా అలీ రచయిత్రిగా పేరు పొందింది.
 
==బాక్సింగ్ ప్రస్థానము==
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_ఆలీ" నుండి వెలికితీశారు