క్రియేటివ్ కామన్స్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
'''క్రియేటివ్ కామన్స్''' ('''సీసీ''') అమెరికాకు చెందిన ఒక లాభాపేక్షలేని సంస్థ. సృజనాత్మక రచనలను ప్రోత్సహించి వాటిని మరింతమందికి చేరేలా చట్టబద్ధమైన వెసులుబాటు కల్పించడం ఈ సంస్థ చేస్తున్న ముఖ్యమైన పని. <ref>{{cite web|url=http://wiki.creativecommons.org/FAQ |title=తరచూ అడిగే ప్రశ్నలు|publisher=క్రియేటివ్ కామన్స్ |date = |accessdate=20 డిసెంబర్ 2011}}</ref> ఈ సంస్థ పలు కాపీరైట్ సంబంధిత లైసెన్సులను జనసామాన్యానికి ఉచితంగా అందుబాటులో తెచ్చింది. ఈ లైసెన్సులను వాడి రచయితలు వారి కృతులపై కొన్ని హక్కులను సడలించి సాధారణ జనాలకు అందుబాటులోకి తేవచ్చును. ఏ హక్కులను సాధారణ ప్రజలకోసం సడలిస్తున్నారో, ఏ హక్కులను తమ వద్దనే ఉంచేసుకుంటున్నారో వేరు వేరుగా తెలపవచ్చు. ఈ విషయాలను తెలుపేందుకు విశేష చిహ్నాలతో కూడిన బొమ్మలు లేదా ఆయా హక్కులను తెలిపే పొడి అక్షరాలను వాడవచ్చు. క్రియేటివ్ కామన్స్ రచయితకున్న కాపీ హక్కుల తొలగించదు, ఆ హక్కులను మరింత వివరిస్తుంది. ''సర్వ స్వామ్యహక్కులు'' అన్న పదానికి తెర తీస్తూ, ''లిఖిత పూర్వక ముందస్తు అనుమతి'' అన్న పంథాను మార్చివేస్తూ; రచయితకూ-రచనను వాడుకునే వ్యక్తికి మధ్య సంబంధాన్ని విస్తృత పరుస్తుంది. అనగా రచనను వాడుకోవాలనుకునే వ్యక్తి అవసరమున్నపుడు రచయితను సంప్రదించి అనుమతి తీసుకునే పద్ధతి కాకుండా, రచయితే తన రచనను స్వయంగా వాడుకోవచ్చు అని ముందస్తుగా ప్రకటన చేయడం.
ఇందువలన అనవసరపు ఖర్చు, అనవసరపు సంప్రదింపులు తొలగిపోతాయి. తద్వారా రచయితకూ, వాడుకుంటున్న వ్యక్తికీ ఇద్దరికీ లాభం చేకూరుతుంది. [[వికీపీడియా]] ఈ లైసెన్సుల్లో ఒకదాన్ని వాడుతుంది.<ref>{{cite web |url=http://wikimediafoundation.org/wiki/Terms_of_Use |title=వికీమీడియా ఫౌండేషన్ వారి వాడుక మార్గదర్శకాలు |accessdate=June 11, 2012}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/క్రియేటివ్_కామన్స్" నుండి వెలికితీశారు