భారత స్వాతంత్ర్య చట్టం 1947: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
సంప్రదింపుల అనంతరం [[జవహర్ లాల్ నెహ్రూ]], [[వల్లభ్ భాయి పటేల్]], [[ఆచార్య కృపలానీ]] ప్రాతినిధ్యంలోని కాంగ్రెస్ పార్టీ, [[మహమ్మద్ అలీ జిన్నా]], [[లియాఖత్ అలీ ఖాన్]], [[అబ్దుల్ రబ్ నిష్తార్]] ల ప్రాతినిధ్యంలోని ముస్లిం లీగ్, సిక్ఖుల ప్రతినిధిగా [[బల్దేవ్ సింగ్|సర్దార్ బల్దేవ్ సింగ్]] లతో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా [[లార్డ్ మౌంట్‌బాటన్]] ఒప్పందానికి వచ్చాకా యు.కె. ప్రధానమంత్రి [[క్లెమెంట్ అట్లీ]] ప్రభుత్వం, [[బ్రిటీష్ ఇండియా|భారత]] [[గవర్నర్ జనరల్]] లార్డ్ మౌంట్ బాటన్ కలిసి చట్టాన్ని తయారుచేశారు.
 
అధికార బదిలీ కోసం సంప్రదింపులు చేసేందుకు వచ్చిన [[1946 భారతదేశానికి క్యాబినెట్ మిషన్|క్యాబినెట్ మిషన్]] సమైక్య భారత సమాఖ్య ప్రతిపాదన([[1946 భారతదేశానికి క్యాబినెట్ మిషన్|మే 16 ప్రతిపాదన]])కు [[కాంగ్రెస్]], [[ముస్లిం లీగ్]] ల ఆమోదం లభించింది. కానీ క్యాబినెట్ మిషన్ సభ్యుడు క్రిప్స్ ఎవరికి అనుకూలమైన నిర్వచనం వారికి చెప్తూ ఆమోదం పొందడంతో వారు వెళ్ళగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగిస్తూ దాన్ని పూర్తిగా తిరస్కరించారు. దాంతో ఆగ్రహించిన ముస్లిం లీగ్ నాయకుడు [[మహమ్మద్ అలీ జిన్నా|జిన్నా]] [[ప్రత్యక్ష కార్యాచరణ దినం|ప్రత్యక్ష కార్యాచరణ దినానికి]] పిలుపునిచ్చారు. హింసాత్మకమైన ఈ మలుపుతో కాంగ్రెస్, బ్రిటీష్ ప్రభుత్వాలపై ఒత్తిడి వచ్చింది.