దేవులపల్లి వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
==పోరాట యోధుడు==
జనగామ ప్రాంతంలో చెదిరిన ఉద్యమాన్ని సాయుధ పోరాట దశకు చేర్చి, బెదిరిన ప్రజలను వీరుయోధులుగా తీర్చిదిద్ది ఏనాడూ శత్రువు చేతికి చిక్కకుండా పోరాట ప్రాంతాల్లో, సాయుధ దళాలతోనే వుంటూ అడుగడుగున పార్టీలోని మితవాదుల కుట్రలను ఎదిరిస్తూ రజాకార్లకే కాకుండా యాభై వేల నెహ్రూ సైన్యాలను సైతం మూడేళ్లకు మూడేళ్లకుపైగా ముప్పుతిప్పలు పెట్టిన పోరాటానికి, మార్గదర్శి ఆయన. 1944-51 దాకా ఏడేళ్లపాటు ప్రజలను పోరాటానికి సిద్ధం చేయడానికి భావజాల వ్యాప్తికోసం, జరిగిన అన్యాయాలను లోకం దృష్టికి తేవడం కోసం పల్లెపల్లె, ఇల్లిల్లు తిరిగి బాధితులను స్వయంగా కలిసి వెట్టిచాకిరి, ఆకునూరు-మాచిరెడ్డి పల్లె దురంతాలు, నల్గొండ ప్రజల వీరోచిత పోరాటం జనగామ ప్రజల పోరాటం వంటి విలువైన సాహిత్యం వెలువడింది. <ref name="ఆ యోధున్ని మరిచిపోదామా?">{{cite news|title=ఆ యోధున్ని మరిచిపోదామా?|url=http://namasthetelangaana.com/Editorial-News-in-Telugu/%E0%B0%86-%E0%B0%AF%E0%B1%8B%E0%B0%A7%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE-1-7-489612.html|accessdate=7 June 2016|agency=namasthetelangaana|publisher=వి.ప్రకాశ్, రాజకీయ విశ్లేషకులు|date=31 May 2015}}</ref>
 
 
నల్గొండ జిల్లా కడవెండి గ్రామంలో శాంతియుతంగా సాగుతున్న వాలంటరీ దళ ఊరేగింపుపై 1946 జూలై 6న భూస్వాముల గూండాలు కాల్పుల్లో దొడ్డి కొమురయ్య మరణించాడు. దీంతో తెలంగాణ రైతాంగ ప్రజా ఉద్యమం ఉన్నత స్థాయికి చేరి, సాయుధ పోరాట రూపం తీసుకున్నది. 1946 డిసెంబర్ నాటికి దాదాపు120 గ్రామాల్లో గ్రామ రాజ్యాలేర్పడి 3,000 ఎకరాల భూస్వాముల భూములను పేదలకు పంచారు. 1946 నుండి 1951 వరకు సాగిన ఈ పోరాటంలో డీవీ ప్రధాన పాత్రధారి. సాయుధ పోరాటాన్ని విరమించాలని 1948లో ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించినప్పుడు డీవీ ‘తెలంగాణ సాయు ధ పోరాటాన్ని విరమించాలనే తప్పుడు ధోరణులపై విమర్శ’ అన్న గ్రంథాన్ని రచించారు.<ref>[http://www.sakshi.com/news/opinion/but-thats-just-a-busy-public-fighter-244851 అవిశ్రాంత ప్రజా పోరాట యోధుడు దేవులపల్లి]</ref>
 
==రచయితగా==
దేవులపల్లి కలం నుంచే మా భూమి వంటి అనేక నాటకాలకు, కళారూపాలకు, రచనలకు, పాటలకు, బుర్రకథలకు కథావస్తువుగా మారింది. 1983-84లో దేవులపల్లి గళం నుంచి జాలువారి అక్షరరూపం సంతరించుకున్న తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946-1951) సాయుధ పోరాట కాలం నాటి, అంతకన్న రెండు మూడు దశాబ్దాలకు పూర్వం వున్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులను, జన జీవన స్థితిగతులను వివరించే సాధికారత కలిగిన ఏకైక ప్రామాణిక గ్రంథమని చెప్పవచ్చు.<ref name="ఆ యోధున్ని మరిచిపోదామా?"/>