భారత స్వాతంత్ర్య చట్టం 1947: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
అధికార బదిలీ కోసం సంప్రదింపులు చేసేందుకు వచ్చిన [[1946 భారతదేశానికి క్యాబినెట్ మిషన్|క్యాబినెట్ మిషన్]] సమైక్య భారత సమాఖ్య ప్రతిపాదన([[1946 భారతదేశానికి క్యాబినెట్ మిషన్|మే 16 ప్రతిపాదన]])కు [[కాంగ్రెస్]], [[ముస్లిం లీగ్]] ల ఆమోదం లభించింది. కానీ క్యాబినెట్ మిషన్ సభ్యుడు క్రిప్స్ ఎవరికి అనుకూలమైన నిర్వచనం వారికి చెప్తూ ఆమోదం పొందడంతో వారు వెళ్ళగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగిస్తూ దాన్ని పూర్తిగా తిరస్కరించారు. దాంతో ఆగ్రహించిన ముస్లిం లీగ్ నాయకుడు [[మహమ్మద్ అలీ జిన్నా|జిన్నా]] [[ప్రత్యక్ష కార్యాచరణ దినం|ప్రత్యక్ష కార్యాచరణ దినానికి]] పిలుపునిచ్చారు. హింసాత్మకమైన ఈ మలుపుతో కాంగ్రెస్, బ్రిటీష్ ప్రభుత్వాలపై ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశాన్ని సమాఖ్యగా ఉంచే మే 16 ప్రతిపాదన, పూర్తి బెంగాల్, పూర్తి పంజాబ్ లతో పాకిస్తాన్ విభజించి ఏర్పరిచే జూన్ 16 ప్రతిపాదనకు మధ్యగా మరో ప్రణాళికను ముందు సివిల్ సర్వెంట్ [[వి.కె.మీనన్]] తయారు చేశారు. దీని ప్రకారం బ్రిటీష్ ఇండియా [[భారత దేశం]], [[పాకిస్తాన్]] లుగా విభజన అవుతుంది, అలాగే [[బెంగాల్]], [[పంజాబ్ ప్రావిన్సు|పంజాబ్]] ప్రావిన్సులు కూడా విభజితమై, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు పాకిస్తాన్ కు, హిందువుల సంఖ్యాధిక్యత ఉన్న ప్రాంతాలు భారతదేశానికి లభిస్తాయి. ఇది [[మౌంట్ బాటన్ ప్రణాళిక]]గా పేరొందింది. దీనికి ముందు కాంగ్రెస్ వారు అంగీకరించారు, ఐతే కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన విన్నప్పుడు వ్యతిరేకించినా అధికార బదిలీకి సిద్ధమైపోతున్న బ్రిటీష్ ప్రభుత్వం ఈ ప్రతిపాదననూ తిరస్కరిస్తే అధికారాన్ని బేషరతుగా కాంగ్రెస్ కు బదిలీ చేయగలదని అనుమానించిన జిన్నా మౌంట్ బాటన్ నుంచి వినగానే దీనికి అంగీకరించారు.<ref name="రాజ్ మోహన్ గాంధీ - వల్లభ్ భాయ్ జీవిత చరిత్ర">{{cite book|last1=గాంధీ|first1=రాజ్ మోహన్|authorlink1=రాజ్ మోహన్ గాంధీ|title=వల్లభ్ భాయ్ పటేల్:జీవిత కథ|date=మే 2016|publisher=ఎమెస్కో బుక్స్|location=హైదరాబాద్|edition=2|language=తెలుగు (అనువాదం)|chapter=విజయం}}</ref>
==చట్టం నేపథ్యం==
===అట్లీ ప్రకటన===
యునైటెడ్ కింగ్ డమ్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ 20 ఫిబ్రవరి 1947న ప్రకటన ఇలావుంది:
# బ్రిటీష్ ప్రభుత్వం బ్రిటీష్ ఇండియాకు పూర్తి స్వంత ప్రభుత్వాన్ని కనీసం జూన్ 1948 నాటికి మంజూరుచేస్తుంది.
# తుది (అధికార) బదిలీ తేదీ నిర్ణయించిన తర్వాత సంస్థానాల భవితవ్యం నిర్ణయమవుతుంది<ref>{{cite book|last=Ghose|first=Sankar|title=Jawaharlal Nehru : a biography|year=1993|publisher=Allied Publ.|location=New Delhi [u.a.]|isbn=9788170233695|page=151|url=https://books.google.com/books?id=MUeyUhVGIDMC&pg=PA151&lpg=PA151&dq=attlee's+announcement&source=bl&ots=vVcK14T3Vt&sig=T6bg0nIdrMdX4o5lQCwqhtRYeTQ&hl=en&sa=X&ei=IwcWUZHIBKjM0AXKo4GYCg&ved=0CD4Q6AEwAg#v=onepage&q=attlee's%20announcement&f=false|edition=1. publ.}}</ref>
 
== మూలాలు ==