జమాబంది: కూర్పుల మధ్య తేడాలు

సవరణ
పంక్తి 2:
== కవులు వర్ణించిన జమాబందీ చరిత్రలు==
క్రీ. శ 1835 లో [[కాకినాడ]] లో జరిగిన శిస్తునిర్ణయాల జమాబందీని [[కుందూరి దాసన్నకవి]] [[ దండకం]] గా వర్ణించియుండగా అంతకు పుర్వము క్రీ.శ 1799 లో [[విశాఖపట్టణం]] లోజరిగిన ఇనాములకు సంబందించిన జమాబందీ ని [[వర్దిపర్తి కొనరాట్కవి]] [[ సీసమాలిక]] గా వర్ణించారు
====‘జమాబందీ దండకము’====
క్రీ.శ 1835 మే నెలలో కాకినాడలో జరిగిన జమాబందీని దండకములాగ వర్ణించుతూ చేసిన సాహిత్యం[[కుందూరి దాసన్న కవి]] రచించిన ‘జమాబందీ దండకము ’. కుందూరి దాసన్నకవి గారి జీవిత విశేషాలు, పుట్టు పూర్వోత్తరాలను గూర్చి సమాచారమేమీ లేకపోయునప్పటికీ దాసన్నకవి గారు రచించిన ఈ ‘జమాబందీ దండకము’ అరుదుగా లభించే 19వ శతాబ్దపు తెలుగు సాహిత్య ప్రచురణగుటయే కాక ఆ కాలపు పారిభాషిక పదమైన ‘జమాబందీ’తో పరిచయంచేసి (చూడు [[పారిభాషిక పదకోశం]]), ఆ జమాబందీ ఎంత హడావుడిగా జరిగేదీ, బ్రిటిష్ వారి పరిపాలనలో రెవెన్యూ లెఖ్కలు ఏవిధంగా కట్టుదిట్టమైన సారధ్యముతో నడిచేవీ తెలియజేయు రచన. 1974 లో [[దిగవల్లి వేంకట శివరావు]]గారు సంకలనంచేసి [[గ్రామోద్యోగి పత్రిక]]సంపాదకులు [[ పసుపులేటి కృష్ణయ్య]]గారి ముద్రాక్షరశాలలో ముద్రించి ఈ రచనను ప్రకటించారు. శివరావు గారి చేతి వ్రాతలోనున్న అముద్రిత పీఠిక వలన కుందూరి దాసన్న కవి రచించిన ఈ ‘జమాబందీ దండకము’ అనే రచన యొక్క చేతివ్రాత ప్రతి మహాకవి [[దాసు శ్రీరాములు]] (1848 -1908) గారి వద్ద యుండినదనియూ, వారి కుమారుడు [[దాసు కేశవరావు]] గారు 1897 లోమొట్టమొదటి సారిగా దీనిని సంకలనంచేసి వారి [[వాణీ ముద్రాక్షర శాల]]( చూడు [[దాసు విష్ణు రావు]] గారు), బెజవాడలో ముద్రించి ప్రచురించారనియూ తెలియుచున్నది. ఈ దండకములో అనేక గ్రామాల పేర్లు, పదవులు, పదవులహోదాలు, పదవుల్లోనున్న ఉద్యోగులు అమీనులు,బంట్రోత్తులు పేర్లుతో సహా, అప్పటి స్తితిగతులు, దండక రూపంలో వర్ణించిన ఆ సాహిత్యము చరిత్రాత్మకమైనదికూడా.<ref name= "దిగవల్లి వేంకట శివరావు(1984)"/>.
 
===== దండకం లోని వివరాలు=====
“శ్రీమాన్ మహా కుక్కుటేశాంక సౌధా గపీఠస్ధితా శాంకరీ రాజ రాజేశ్వరీ దేవి హూంకారిణీ సావధానంబుగా మన్మధాబ్ధునం దావకావాసమౌ పీఠికా పట్టణరాజ్యంబునన్ శ్వేతవక్తృల్ జమాబంది సేయంగ నందౌ చమత్కారముల్ దండకంబొప్పగా జెప్పెదన్ దివ్యచిత్తంబునన్ దెచ్చినా తప్పులన్ గాచి రక్షింపవే గౌరీ నీకుం ప్రమోదంబుగా వందనం బాచరింతున్ మహా దేవీ వైశాఖమాంసాంత్య పక్షంబున్ గ్రాంటుగారొప్పగా కాకినాడం బ్రవేశించి........................” అలా మొదలుపెట్టి "......................ముంగమూరాన్వయుండైన లక్ష్మీనృసింహుండు దావచ్చి పెద్దాపురంబుం బ్రవేశించి యా నాల్గు ఠాణాల కణాలతో లేచిరమ్మంచు లక్ష్మయ్యకుం వ్రాయగావారుసంతోషిత................తత్సభామధ్యభాగోోద్భవానేక చిత్రవిచిత్ర ప్రభాయక్తనాశ్చర్యముల్ జెప్పుకొంచుం చిదానందులై యుండిరోయమ్మ నీ దాసుడైనట్టి కుందూరి దాసయ్యనుంగాంచి రక్షింపవమ్మామహాదేవి తుభ్యం నమస్తే నమస్తే నమః" అని పరిసమాప్తి చేసిన ఆ దండక రచన కామాలు తప్ప చివరదాకా ఫుల్ స్టాప్ లేక సాగిన 8 పుటలు. సశేషం
 
=====చరిత్రాంశములు==== =
సమాలోచన పక్షపత్రికలో 1984 లో దిగవల్లి వేంకట శివరావుగారు రచించిన వ్యాసమునందు కుందూరి దాసన్న గారి ‘జమాబందీ’ లో ఉల్లేఖించిన సంవత్సరము,మన్మధనామ సంవత్సరం (క్రీ.శ 1835 మార్చి30 న మొదలైనమన్మధనామ సంవత్సరం). ఆ సంవత్సరంలో జరిగిన జమాబందీ 1835 మే నెలలో జరిగినట్లుగా అప్పటి ప్రభుత్వ రికార్టులన బట్టి తెలియుచున్నది. దండకములో వర్ణిం చిన ఠాణాలు, గ్రామాల పేర్లు, పట్టణాలు, పరిపాలనా సిబ్బందుల పదవీ హోదాలు, పేర్లు, మొదలగు వివరాలు అలనాటి కంపెనీ ప్రభుత్వ రికార్డులతో సరిపోయినవని చాలామట్టుకు గోదావరి జిల్లా మాన్యువల్ లోనూ, గుంటూరు జిల్లా మాన్యువల్లోనూ ఉల్లేఖించబడినవని ఖరారుచేశారు.<ref name= "దిగవల్లి వేంకట శివరావు(1984)"/>. దాసన్నకవి గారి దండకములో చెప్పబడిన గ్రాంటు గారు, అప్పటి[[రాజమండ్రీ జిల్లా]](ఇప్పటి తూర్పు+ పశ్చమగోదావరి జిల్లాలు కలిపియున్నట్టి జిల్లా) కు 1835 నుండీ 1837 వరకూ జిల్లా కలెక్టరు, పాట్రిక్ గ్రాంటు(Patrik Grant) దొరగారని గోదావరి జిల్లా మాన్యువల్ వలన తెలుయుచున్నదనీనూ, దండకంలో జమాబందీ కాకినాడ పట్టణంలో జరిగినదని చెప్పబడియున్నది. 1835నాటి కాకినాడ పట్టణం ఆనాటి రాజమండ్రీజిల్లాకు కేంద్రీయపట్టణం. దండకములో ఉల్లేఖించబడిన "మహాభీమలింగేశుదేవాలయం"(1835 నాటికి కాకినాడ కలెక్టరు కచేరీలో ఇంగ్లీషు రికార్డుకీపరుగానుండిన [[దిగవల్లి తిమ్మరాజు పంతులు]] గారు 1828లోనిర్మించిన దేవాలయం). వివరించిన గ్రామాలు ఠాణాలను బట్టి అవి పెద్దాపురం మరియూ పిఠాపురం సంస్థానంలోనివని తెలియుచున్నది. అలాగే సిరస్తదారుడని ముంగమూరి లక్ష్మీనరసింహంగారని ఉల్లేఖించబడ్డ ఉద్యోగి గుంటూరు, నెల్లూరు జిల్లా లో పనిచేసి పదోన్నతితో 1835-36 మధ్యకాలం రాజమండ్రీ జిల్లాకు హుజూరుసిరస్తదారుడైనాడని ఫ్రైకెన్ బర్గు(Freikenberg) సంకలనంచేసిన (Oxford university Press ప్రచురణ) గుంటూరు జిల్లా మాన్యువల్ లో నుండుటవలన దాసన్నకవిగారి జమాబందీ చరిత్రాధారములుకలదని చెప్పవచ్చు. ఇంకా కొన్ని నిర్వివాదక విశేషములు కనబరచవచ్చు. ఆ జమాబందీ దండకము వలన ఆంగ్లేయ కంపెనీపరిపాలనా కాలం లో రెవెన్యూ లెఖ్కలు కట్టుదిట్టములతో జరిగేదని కూడాతెలియుచున్నది.
 
=====1835కు ముందు జరిగిన శిస్తునిర్ణయాల జమాబందీలు=====
1984 సెప్టెంబరు 1 న వెలువడిన సమాలోచన పక్షపత్రికలో 1794- 1850 మద్యకాలంనాటి జమాబందీలను గురించిన వ్యాసము లో చెప్పబడియున్నవి.
 
===='కరణాల భోగట్ట-కమిటీ ఉత్తరం' అనే సీసమాలిక ====
[[అడిదెం రామారావు]] గారు రచించిన [[ విస్మృత కళింగాంధ్ర కవులు]] అను పుస్తకములో [[వర్దపర్తి కొనరాట్కవి]] రచించిన సీసమాలిక పద్యము 'కరణాల భోగట్ట-కమిటీ ఉత్తరం' లో ఇనాముల ఫైసలాకు క్రీ.శ 1799లో విశాఖపట్టణంలో చేసిన జమాబందీ వున్నదని ఆంధ్రప్రభ 21-06-1987 న దిగవల్లి వేంకట శివరావు గారు ప్రచురించిన వ్యాసము...సశేషం
===== సీసమాలిక లోని వివరాలు=====
సశేషం
 
"https://te.wikipedia.org/wiki/జమాబంది" నుండి వెలికితీశారు