జమాబంది: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
=====చరిత్రాంశములు=====
సమాలోచన పక్షపత్రికలో దిగవల్లి వేంకట శివరావుగారు 1984 లో రచించిన వ్యాసమునందిచ్చిన చరిత్రాంశాల వివరణ ప్రకారం కుందూరి దాసన్న గారి ‘జమాబందీ దండకం’ లో ఉల్లేఖించిన సంవత్సరము,మన్మధనామ సంవత్సరం. క్రీ.శ 1835 మార్చి30 న మన్మధనామ సంవత్సరం మొదలైనది. ఆ సంవత్సరంలో జరిగిన జమాబందీ 1835 మే నెలలో జరిగినట్లుగా అప్పటి ప్రభుత్వ రికార్టులను బట్టి తెలియుచున్నది. దండకములో వర్ణిం చిన ఠాణాలు, గ్రామాల పేర్లు, పట్టణాలు, పరిపాలనా సిబ్బందుల పదవీ హోదాలు, పేర్లు, మొదలగు వివరాలు అలనాటి కంపెనీ ప్రభుత్వ రికార్డులతో సరిపోయినవని చాలామట్టుకు గోదావరి జిల్లా మాన్యువల్ లోనూ, గుంటూరు జిల్లా మాన్యువల్లోనూ ఉల్లేఖించబడినవని ఖరారుచేశారు.<ref name= "దిగవల్లి వేంకట శివరావు(1984)"/>. దాసన్నకవి గారి దండకములో చెప్పబడిన గ్రాంటు గారు, అప్పటి[[రాజమండ్రీ జిల్లా]](ఇప్పటి తూర్పు+ పశ్చమగోదావరి జిల్లాలు కలిపియున్నట్టి జిల్లా) కు 1835 నుండీ 1837 వరకూ జిల్లా కలెక్టరు, పాట్రిక్ గ్రాంటు(Patrik Grant) దొరగారని గోదావరి జిల్లా మాన్యువల్ వలన తెలుయుచున్నదనీనూ, దండకంలో జమాబందీ కాకినాడ పట్టణంలో జరిగినదని చెప్పబడియున్నది. 1835నాటి కాకినాడ పట్టణం ఆనాటి రాజమండ్రీజిల్లాకు కేంద్రీయపట్టణం. దండకములో ఉల్లేఖించబడిన "మహాభీమలింగేశుదేవాలయం"( 1835 నాటికి కాకినాడ కలెక్టరు కచేరీలో ఇంగ్లీషు రికార్డుకీపరుగానుండిన [[దిగవల్లి తిమ్మరాజు పంతులు]] గారు 1828లోనిర్మించిన దేవాలయం). వివరించిన గ్రామాలు ఠాణాలను బట్టి అవి పెద్దాపురం మరియూ పిఠాపురం సంస్థానంలోనివని తెలియుచున్నది. అలాగే సిరస్తదారుడని ముంగమూరి లక్ష్మీనరసింహంగారని ఉల్లేఖించబడ్డ ఉద్యోగి గుంటూరు, నెల్లూరు జిల్లా లో పనిచేసి పదోన్నతితో 1835-36 మధ్యకాలం రాజమండ్రీ జిల్లాకు హుజూరుసిరస్తదారుడైనాడని ఫ్రైకెన్ బర్గు(Freikenberg) సంకలనంచేసిన (Oxford university Press ప్రచురణ) గుంటూరు జిల్లా మాన్యువల్ లో నుండుటవలన దాసన్నకవిగారి జమాబందీ చరిత్రాధారములుకలదని చెప్పవచ్చు. ఇంకా కొన్ని నిర్వివాదక విశేషములు కనబరచవచ్చు. ఆ జమాబందీ దండకము వలన ఆంగ్లేయ కంపెనీపరిపాలనా కాలం లో రెవెన్యూ లెఖ్కలు కట్టుదిట్టములతో జరిగేదని కూడాతెలియుచున్నది.
 
=====1835కు ముందు జరిగిన శిస్తునిర్ణయాల జమాబందీలు=====
"https://te.wikipedia.org/wiki/జమాబంది" నుండి వెలికితీశారు