కంచి వాసుదేవరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కంచి వాసుదేవరావు''' తెలుగు రచయిత. ఆయన ఆరు దశాబ్దాల పాటు తెలుగునాట వార, మాస, దిన పత్రికలలో పాత్రికేయునిగా పనిచేసారు. <ref name=vasudevarao>{{cite news|title=ఆదర్శ పాత్రికేయుడు|url=http://www.andhrajyothy.com/Artical?SID=255056|accessdate=18 June 2016|agency=ఆంధ్రజ్యోతి|publisher=బి.వి. అప్పారావు|date=17 June 2016}}</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమగోదావరి జిల్లా]] [[ఏలూరు]]<nowiki/>లో [[1930]], [[జూన్ 6]]<nowiki/>న జన్మించారు. [[మచిలీపట్నం]] హిందూ కళాశాలలో చదివారు. తర్వాత [[విశాఖపట్నం]]<nowiki/>లోని [[ఆంధ్ర వైద్య కళాశాల|ఆంధ్ర మెడికల్‌ కళాశాల]]<nowiki/>లో డిప్లొమా ఇన ఫార్మసీ చేశారు. అయినా విద్యార్హతకు తగిన వృత్తిలో కాక, చిన్ననాటి నుంచి తనను ప్రభావితం చేసిన జాతీయోద్యమ పరిస్థితుల ప్రభావంతో, పత్రికా రచయితగా జీవితం ప్రారంభించారు.<ref name=vasudevarao/>
 
==పత్రికా రంగం==
ఆయన 1957లో [[కృష్ణా పత్రిక]] కు సబ్ ఎడిటరుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్|రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌]]<nowiki/>లో పనిచేశారు. తరువాత తన సహ విద్యార్థి, సుప్రసిద్ధ నటుడు, నాటక చరిత్రకారుడు మిక్కిలినేని సాహచర్యంతో విశాల ప్రపంచ దృక్పథంతో, కమ్యూనిజం, హిందూయిజం, గాంధీయిజం గురించిన అవగాహన పెంచుకున్నారు. మంచి సృజనాత్మకతతో 1946లోనే కథారచనకు శ్రీకారం చుట్టారు. ఆనాటి ‘ఆనందవాణి’లో తొలికథ ‘జాలి గుండె’ అచ్చయింది. ఆ స్ఫూర్తితో దాదాపు నూట యాభై వరకు కథలు, మూడు నవలలు రచించారు. వాటిలో "శాపగ్రస్తులు" నవల పాఠకాదరణ పొందినది. ఆయనకు మంచి రచయితగా, సాహిత్యవేత్తగా కూడా గుర్తింపు తెచ్చింది. 1957 నుండి 1967 వరకు "చుక్కాని" పత్రికకు సంపాదకునిగా పనిచేసారు. ఆయన "సమాచారం" పత్రికలో కొంతకాలం పనిచేసారు. 1976 నుంచి 1988 వరకు [[ఈనాడు]] [[విశాఖపట్నం]] యూనిట్‌లో సబ్‌ఎడిటర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.<ref name=vasudevarao/>
 
ఆయన గ్రేటర్‌ విశాఖ నగర శివారు ఆరిలోవలో సాధారణ ఆవాసంలోనే జీవితం గడిపారు.
"https://te.wikipedia.org/wiki/కంచి_వాసుదేవరావు" నుండి వెలికితీశారు