పింగళి దశరధరామ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 18:
 
==వ్యక్తిగత జీవితం==
దశరధరామ్ అనుమానాస్పద పరిస్థితులలో [[1985]]వ సంవత్సరం [[అక్టోబరు 21]]వ తేదీన హత్యకావించబడటం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. చంపబడేప్పటికి అతని వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. ఇతని అభిమానులు, [[సత్యనారాయణపురం(విజయవాడ)]] లో మరణాననంతరం అతని విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిష్టించబడిన కొద్ది రోజులకే గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రహాన్ని తవ్వి ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని దశరధరామ్ చౌక్‌గా పిలుస్తారు. పింగళి హేరంబ చలపతిరావు (భారత జండా రూపకర్త [[పింగళి వెంకయ్య]] చిన్న కుమారుడు) దశరధరాం తండ్రి. వీరు సైన్యంలో పని చేశారు. దశరధరామ్ కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఈయన భార్య సుశీల విజయవాడలో ఒక హాస్టల్‌లో మాట్రన్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారట.<ref>http://www.dailyexcelsior.com/02aug01/national.htm</ref> దశరధరామ్ మరణించిన తర్వాత ఆయన భార్య ఎన్‌కౌంటర్ పత్రికను కొంతకాలం నడిపారు గానీ అందుకు తగిన వనరులూ, వ్యక్తులూ లేక పత్రిక ఆగిపోయింది. ఈయన కుమార్తె [[పింగళి చైతన్య]] రచయిత్రిగా పేరు సంపాదించింది. ఈమె వ్రాసిన చిట్టగాంగ్ పోరాట వనితలు అనే పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ నుండి 2016లో యువ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/పింగళి_దశరధరామ్" నుండి వెలికితీశారు