స్మిత (గాయని): కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె
విస్తరించి మొలక స్థాయిని దాటించాను
పంక్తి 13:
}}
తెలుగులో ప్రసిద్ధి చెందిన గాయని మరియు నర్తకి. ఈమె తెలుగులో మొట్ట మొదటి పాప్ ఆల్బం రూపొందినది.
== బాల్యం, విద్యాభ్యాసం ==
స్మిత సెప్టెంబరు 4, 1980 న ప్రభుప్రసాద్, జోగులాంబ దంపతులకు విజయవాడలో జన్మించింది. స్మిత నాలుగేళ్ళ వయసులో ఉండగానే తమ పాఠశాల వార్షికోత్సవంలో బెరుకు లేకుండా పాడి పలువురి ప్రశంసలు పొందింది. పెద్దదయ్యే కొద్దీ ఆమె పలు పోటీల్లో పాల్గొని ఏదో ఒక బహుమతి సాధించుకుని వచ్చేది. ఆమె ఆరు, ఏడు తరగతులు బెంగళూరులోని బిషప్ కాటన్ పాఠశాలలో చదివింది. అక్కడ ఎనిమిదో తరగతి పైబడ్డ వాళ్ళనే సంగీతంలో మెరుగులు దిద్దేందుకు ఎంపిక చేసేవారు. అయినా స్మిత ఉత్సాహం చూసి ఆరో తరగతిలోనే ఆమెకు అవకాశమిచ్చారు. ఆ రెండేళ్ళలో ఆమె సంగీతంలో రాటు దేలింది. ఇంట్లో కూడా సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలు చూస్తే అభినయించడం నేర్చుకుంది. అప్పటికే ఆమె తల్లిదండ్రులు ఆమె కళల్లోనే రాణించగలదని నిర్ధారించుకున్నారు <ref name=idlebrain>{{cite web|last1=Idle|first1=brain|title=Happy Birthday to Smita|url=http://www.idlebrain.com/news/2000march20/smita-birthday2008.html|website=http://www.idlebrain.com/|accessdate=19 June 2016}}</ref>
 
ఆమె ఇంటర్మీడియట్ చదువుకోసం విజయవాడలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో చేరింది. అక్కడ నుంచి ఈటీవీ నిర్వహిస్తున్న [[పాడుతా తీయగా (ధారావాహిక)|పాడుతా తీయగా]] కార్యక్రమంలో పాల్గొనింది. ఫైనల్లో విజేతగా నిలవకపోయినా మంచి గుర్తింపు సాధించింది. అప్పటికే ఆమెకు సినిమాలలో అవకాశాలు రాసాగాయి. అయినా ఆమె తల్లిదండ్రులు ఆమె గొంతు పాప్ సంగీతానికి సరిపోతుందని భావించి ఆమెను ఆ రంగంలో కృషి చేయమని సలహా ఇచ్చారు. అప్పుడే [[హాయ్ రబ్బా]] ఆల్బమ్ ను రూపొందించింది. అది మంచి ప్రజాదరణ పొందింది. ఆ తరువాత చాలా ఆల్బమ్స్ రూపొందించింది.
== వ్యాపారవేత్తగా ==
స్మిత గాయనిగానే కాక వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది. 2002లో హైదరాబాదులోని జూబిలీ హిల్స్ లో బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ అనే పేరుతో బ్యూటీ సెలూన్ ప్రారంభించడంతో ఆమె ప్రస్థానం ఆరంభమయ్యింది. 2006లో విజయవాడలో కూడా అదే పేరుతో సెలూన్ ప్రారంభించింది. దానితో పాటు ఫిట్ నెస్ సెంటర్ ను కూడా ప్రారంభించింది. ఐ కాండీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మరో సంస్థను ప్రారంభించి టీవీ కార్యక్రమాలు రూపొందిస్తోంది. <ref name=idlebrain />
==ఇతర విశేషాలు==
* స్మిత మొట్టమొదటి తెలుగు పాప్ గాయని
* తెలుగు పాత పాటలను రీమిక్ష్రీమిక్స్ చేసిన గాయనిగా ప్రసిద్ధి పొందినది
* ప్రసిద్ద కార్యక్రమములలో పాటలు పాడటం వంటి కార్యక్రమములు నిర్వహిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/స్మిత_(గాయని)" నుండి వెలికితీశారు