సిక్కుమతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
నాలుగవ గురువు రామదాసు. అమృత్ సర్ దేవాలయానికి పునాదులు వేశాడు. అతని కొడుకు, వారసుడూ అయిన అర్జున్ ఈ దేవాలయానికి చాలా ప్రశస్తి కల్పించాడు. ఈనాడు శిక్కులకది ఎంత పవిత్రమైనదో, అంత పవిత్రత సంతరించుకోవడానికి అర్జునే కారకుడు
 
ఇతడు చేసిన మరో గొప్ప పని "గ్రంథసాహిబ్" ను నిర్మించటం. అంతకు ముందరి గురువులందరి రచనలను, హిందూ ముస్లిం రచనలను, వీటికి తోడు తన రచనలనూ కలిపి గ్రంథ సాహిబ్ ను కూర్చాడు. వారు హిందూ ముస్లిం లను అభిమనించినా, వారి గ్రంథాల కంటే, గ్రంథ సాహిబ్ వారికి పవిత్ర గ్రంథమైంది. ఇది తరువాత వారికి పూజా వస్తువు అయింది. అర్జున్ మరో రెండు దేవాలయాలు కూడ నిర్మించాడు కాని, వాటిని మొగల్ చక్రవర్తి జహంగీర్ నాశనం చేసాడు. అర్జున్ కు ముందు హిందూ , ఇస్లాం, శిక్కు మతాల మధ్య తేడా ను పెద్దగా పట్టించుకొనె వారుకాకువారుకాదు శిక్కులు. కాని అర్జున్ ఈ మతాల మధ్య తేడాలని నొక్కి చెప్పి శిక్కు మతాన్ని వేరుగా గుర్తించేట్టు చేశాడు.
 
==[[గురు గోవింద సింగ్]] ప్రభావం==
[[గురునానక్]], అర్జున్ ల తరువాత శిక్కుమతాన్ని అత్యంతంగా ప్రభావితం చేసినవాడు గురుగోవింద సింగ్. ఇతడు పదవ గురువూ, గురువులలో చివరివాడు. ఇస్లాం మతం స్వీకరించనందుకు ఇతని తండ్రిని ఒక మొగలాయి చక్రవర్తి చంపించాడు. గోవింద సింగ్ శిక్కులను సైనిక శక్తిగా పరివర్తితం చేయాలనుకున్నాడు. అతడు వ్యక్తిగతంగా పెద్ద వీరుడు కాక పోయినా, మొత్తం మీద శిక్కులను వీర సైనికులుగా మార్చడంలో సఫలుడయ్యాడు. తన అనుచరులందరిని "ఇంటి పేరులు" వదిలివేసి, పేరు చివర "సింగ్" (సింహం) తగిలుంచుకోమన్నాడు. స్త్రీలను తమ చివరి పేరుగా కార్(రాకుమారి) తగిలించుకోమన్నాడు. చాలా మంది హిందూ వీరులకు కూడ ఇంటిపేరు "సింగ్" ఉంది. అందుకని ఇంటి పేర్లును ఎత్తి వేయించాడు. ప్రతి శిక్కూ సింగే కాని, ప్రతి సింగూ సిక్కు కాడని గమనించాలి.
"https://te.wikipedia.org/wiki/సిక్కుమతం" నుండి వెలికితీశారు