ప్రియురాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
మోహిని వేశ్యకుటుంబంలో జన్మించింది. ఆమె గొప్ప నర్తకి. విఠల్‌రావు
ఒక చిత్రకారుడు. అతడు మోహినికి గురువై సంగీతం, సంస్కారం నేర్పిస్తాడు. వేశ్యవృత్తిలో సంపాదన చేస్తున్న అక్క రంగసాని, తల్లి శ్రీహరి మోహినిని వృత్తిలోకి దించాలని ఎంత ప్రయత్నించినా ఆమె నీచమైన ఆ వృత్తి చేయనని, నీతిగా జీవిస్తానని పట్టుపడుతుంది.
 
ధనవంతుడైన కోతిగంతులా కోదండం భార్యను, కూతురు సరోజను నిర్లక్ష్యం చేసి వేశ్యల వెంట తిరుగుతూ, శ్రీహరికి డబ్బు ఆశపెట్టి, మోహిని కోసం ఒత్తిడి చేస్తాడు. శ్యామలరావును పద్మిని ప్రేమిస్తుంది. కానీ అతడు అంగీకరించడు. మోహిని తన అక్క, తల్లితో నృత్య ప్రదర్శన ఇవ్వడానికి వెళుతుంటే కారు చెడిపోతుంది. శ్యామలరావు నృత్య ప్రదర్శన ఆగిపోకుండా తన కారులో వారిని తీసుకుపోతాడు. మోహిని నృత్యాన్ని, ఆమె సంస్కారాన్ని చూసి శ్యామ్‌ ఆమెను ప్రేమిస్తాడు.
 
శ్రీహరి అర్ధరాత్రివేళ కోదండాన్ని మోహిని గదిలోకి పంపుతుంది. మోహిని ఇంట్లోనుంచి పారిపోయి శ్యామలరావును కలుసుకుంటుంది. అతడు ఆమెను తన ప్రాణస్నేహితుడైన విఠల్ రావు ఇంటికి తీసుకుపోతాడు. అతడు వీరిద్దరినీ మద్రాసుకు పంపిస్తాడు.శ్రీహరి, రంగసాని పోలీసు రిపోర్టు ఇచ్చి, మోహిని ఫోటోలు అన్ని చోట్లకూ పంపుతారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రియురాలు" నుండి వెలికితీశారు