మానస సరోవరం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54:
మానసిక సంకల్పంతో పాటు శారీరకం గా కూడా అక్కడి వాతావరణం తట్టుకునే శక్తి కావాలి. ఈ యాత్రకి సిద్దం కావడానికి ముందు నుండీ ఉదయం సాయంత్రం నడక, శ్వాసకి సంబంధించిన వ్యాయామం, యోగా చేయడం ఎంతైనా తోడ్పడతాయి. మధుమేహం, స్పాండిలైటీస్, బాక్పేఇన్ ఆస్తమ, సైనస్ వంటివి ఉంటే, ఈ యాత్ర చేయలేరు. అయినాసరే ఈ యాత్ర చేయాలనుకుంటే డాక్టర్ని సంప్రదించి సరైన పర్యవేక్షణలో చేయాలి.
సముద్ర మట్టం నుండీ 4000 మీటర్ల ఎత్తు వెళ్లిన తరువాత, శరీరానికి తగినంత ప్రాణవాయువు అందడం కష్టం అవుతుంది. అందుకు డైమాక్స్ అనె టాబ్లెట్ రోజు రాత్రి తప్పనిసరి వేసుకోవాలి. ఇది ఏ ఆల్టిట్యుడ్ లో మొదలుపెడితే, తిరుగు ప్రయాణంలో అక్కడకి వచ్చేదాకా వేసుకోవాలి. ఇక జలుబు దగ్గు, గొంతునొప్పి, నడచి అలసిపోతె వేసుకోడానికి పారాసిటిమాల్, వికారం, వాంతులు, విరోచనాలకి సంబందిచిన ఇంకా ఏ ఇతర వాటికోసమైనా మందులు మన దగ్గర ఉంచుకోడం ఎంతైనా అవసరం. అలాగే చలికి తట్టుకునే విధమైన వస్త్రాలను ధరించాలి. అంతేకాదు ఈ ప్రయాణం లో స్నానం, టాయిలెట్ సౌకర్యం అన్నిచోట్లా సరిగ్గా ఉండదు.అక్కడి పరిస్తితులని బట్టి సర్దుకుని పోడానికి సంసిద్దం కావాలి.
 
భారతీయ అద్భుతాలు -మానస సరోవరం🌼
 
 
*భారతీయ అద్భుతాలు -మానస సరోవరం🌼
కొన్ని వేల ఏళ్ల నుంచి హిందువుల నమ్మకాలు ఇవి. అందుకే జీవితంలో ఒకసారైనా- మానస సరోవరంలో స్నానం చేయాలని.. కైలాస పర్వతాన్ని దగ్గరగా చూసి ప్రదక్షిణం చేయాలని కోట్లాది మంది భావిస్తూ ఉంటారు. కాని సముద్రమట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తున ఉన్న మానస సరోవరాన్ని.. దానికి సమీపంలో ఉన్న కైలాస పర్వతాన్ని అధిరోహించటం అంత సులభం కాదు. అందుకే చాలా మందికి కైలాస యాత్ర ఒక కల.
తీరని కోరిక. కాని ఇప్పుడు చైనా ప్రభుత్వం అక్కడికి సులభంగా చేరుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. భారీ వాహనాలు సైతం సునాయాసంగా ప్రయాణించటానికి వీలుగా రోడ్లు.. కొండ చరియలు విరిగి పడకుండా ఇనుప కంచెలు.. హఠాత్తుగా వరదలు వచ్చి రోడ్డు కొట్టుకుపోకుండా పక్కనే కాలువలు వంటి అనేక సదుపాయాలను కల్పిస్తోంది. వచ్చే ఒకటి రెండేళ్లలో ఈ యాత్రను సులభంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
"https://te.wikipedia.org/wiki/మానస_సరోవరం" నుండి వెలికితీశారు