శివలింగం: కూర్పుల మధ్య తేడాలు

ముసా స్ధానం మార్చబడింది
కోత్త అంశమైన లింగోద్బవం గుర్చి చేర్చుట
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
సాధారణంగా లింగము శక్తికి, స్త్రీ సృజనాత్మక శక్తికి సూచిక అయిన [[లింగ యోని|యోని]]లో ప్రతిష్టింపబడి ఉంటుంది. లింగ-యోనుల సంగమం నిష్క్రియాత్మక విశ్వం మరియు క్రియాత్మక కాలం యొక్క కలయికని, ద్వైతంలోని అనంత ఐక్యతని, జీవోద్భావనని సూచిస్తుంది.
 
పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని "నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. '''శివం''' అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. '''లింగం''' అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో ప్రజల గౌరవాన్ని పొందుతోందని హిందువుల అభిప్రాయం. [[కాబా]] గోడలో అమర్చిన [[ అస్వాద్]] అనే నల్లని రాయిని [[స్వర్గ రాయి]] గా భావించి ముస్లిములు [[హజ్]] యాత్రలో ముద్దు పెట్టుకుంటారు. హిందువులు ఈ రాయిని శివలింగంగా భావించి గౌరవిస్తారు .
 
 
== పురాణాల్లో లింగోద్బవం ==
మహా శివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజ పరమ శివుడిని కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించడం జరిగింది. మహా ప్రళయం తరువాత, సృష్టి, స్థితి కారకులైన బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పోటీ వచ్చి, అది సంగ్రామానికి దారి తీసింది. ఒకరిపై ఒకరు భీకర ఆస్త్రాలను ప్రయోగించుకునే వేళ, మరో ప్రళయాన్ని నివారించేందుకు లయ కారకుడు రంగంలోకి దిగి, ఆద్యంతాలు తెలియని మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాటి అర్థరాత్రి. ఇదే లింగోద్భవ కాలం.
 
ఇక ఈ శివ లింగావతారం మొదలును తెలుసుకునేందుకు విష్ణువు వరాహ రూపంలో, ముగింపును చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్లి, తమ లక్ష్యాన్ని చేరలేక తిరిగి వచ్చి శివుడినే శరణు కోరగా, తన నిజరూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపాడు. శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే, రాత్రి 11 గంటల వేళ మొదలయ్యే లింగోద్భవ కాల పూజలను భక్తులు అత్యంత శ్రద్ధతో నిర్వహించి పరమశివుడి కృపకు పాత్రులవుతుంటారు.
 
== శివ లింగనిర్మాణము ==
"https://te.wikipedia.org/wiki/శివలింగం" నుండి వెలికితీశారు