పద్మనాభ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
విజయనగర జమిందారు చెల్లించవలసిన పేష్కస్ పెంచడానికి, అతని సైనిక బలాన్ని తగ్గించడానికి, అతని నుండి ఎనిమిదిన్నర లక్షల పేష్కస్ బకాయిలను వసూలు చేయడానికి ఆంగ్లేయులు ప్రయత్నించారు. తాను వారికి ఋణపడలేదని ఋజువు చేసినప్పటికీ ఆంగ్లేయులు 1793 ఆగష్టు 2 న విజయనగరాన్ని ఆక్రమించారు. రాజ్యంలోని రైతులు ఆంగ్లేయులకు భూమి శిస్తు చెల్లించడానికి నిరాకరించారు. అందువలన ఆంగ్లేయులు చిన విజయరామరాజును నెలకు 1200 రూపాయల పింఛనుతో మచిలీపట్నానికి వెళ్ళవలసిందిగా ఆదేశించారు. దానిని లెక్కచేయకుండా రాజు విజయనగరం, భీమునిపట్నం మధ్యనున్న పద్మనాభం చేరాడు. ఆంగ్లేయుల సేనలు చినవిజయరామరాజును ముట్టడించి యుద్ధంలో ఓడించి వధించాయి.
==యుద్ధం==
ఒప్పందం ప్రకారం చెల్లించే వలసిన కప్పాన్ని ఇంకాస్త పెంచి అదనంగా చెల్లించాలని సైన్యం సంఖ్య తగ్గించుకోవలసిందిగా విజయనగర పాలకుడు చిన్నవిజయరామరాజును బ్రిటీష్ వాళ్ళు డిమాండ్ చేశారు. బ్రిటీష్ వాళ్ళు బకాయిలుగా డిమాండ్ చేస్తున్న లక్షల యాభైవేల పెస్కాలను తాను చెల్లించవలసిన అవసరం లేదని, ఒప్పందం ప్రకారం చెల్లించిన వలసి కప్పం మొత్తం ఇప్పటికే చెల్లించానని, సైన్యం సంఖ్య ఎలాంటి పరిస్థితుల్లో తగ్గించబోనని బ్రిటిషర్లకు విజయరామరాజు గట్టిగా సమాధానమిచ్చారు. దాంతో ఆగ్రహించిన బ్రిటీష్ వాళ్ళు విజయనగరాన్ని అక్రమించారు. విజయనగరం నుంచి విజయరామరాజు పద్మనాభం ఊరికి వద్దకు మకాం మార్చారు. మద్రాస్ గవర్నర్ సర్ చార్లెస్ ఓక్లే తరపున కల్నెల్ పెండర్గస్ట్ బ్రిటీష్ సైన్యానికి నాయకత్వం వహించాడు. పద్మనాభం వద్ద మకాం వేసిన చిన్న విజయ రామరాజుపై దొంగదెబ్బతీయడానికి పథకం రచించారు.
 
విజయరామరాజు ఒకవైపు బ్రిటీష్ దౌత్యలతో రాయబారం నడుపుతూ, సామరస్యపూర్వక పరిష్కారానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే అర్ధరాత్రి వేళ దాడికి బ్రిటీష్ వాళ్ళు రంగు సిద్ధం చేసుకున్నారు. అంగబలాన్ని, అధికారాన్ని ఉపయోగించి విజయనగర సంస్థానాన్ని వశపరచుకోవాలనే బ్రిటీష్ మూకల కుటిల యత్నాలను, ఈ ప్రాంతం విడిచి వెళ్లిపోవాలన్న తెల్లదొరల ఆదేశాలకు బెదరని విజయనగర సంస్థాన పాలకుడు, హసపాటి వంశీయుడయిన చిన విజయరామరాజు బెదరలేదు. సరిగదా బ్రిటీష్ వారితో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. సంస్థానాన్ని ఆక్రమించుకునే ప్రతిపాదనలో భాగంగా బ్రిటీష్ పాలకులు తెరమీదకు తెచ్చిన పన్ను బకాయి అంశానికి కూడా ససేమిరా అన్నారు. సంస్థానాన్ని వశపరచుకొని విజయరామరాజుకు పెన్షన్ ప్రకటించి మద్రాస్ పంపించాలన్న బ్రిటీష్ వారి నిర్ణయంపై విజయనగర సంస్థానం కన్నెర్ర చేసింది. ఇక మిమ్మల్ని ఈ దేశం నుంచి సాగనంపక తప్పదని ఆంగ్లేయులపై ఏకంగా యుద్ధాన్ని ప్రకటించింది ఈ సంస్థానం. అంతకు ముందు కొండూరు యుద్ధంలో ఫ్రెంచివారిని తుదముట్టించిన చరిత్ర సొంతం చేసుకున్న విజయనగర రాజులు అదే స్ఫూర్తితో బ్రిటీష్ వారిపై కూడా పోరుకు సై అన్నారు. అనంత పద్మనాభ స్వామి సన్నిధి లోనే వ్యూహరచన చేసి పోరుబాట పట్టారు. విజయనగర రాజులు తిరుగుబాటు సమాచారాన్ని తెలుసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం కలవరపాటుకు గురయింది. దీన్ని అణిచివేసేందుకు 1794 మే 29వ తేదిన కల్నల్ ఫ్రెండర్ గార్డు నేతృత్వంలోని అయిదు కంపెనీల సైన్యాన్ని భీమిలి ప్రాంతంలో మోహరించింది. యుద్ధమో, మద్రాస్ వెళ్ళేందుకు సిద్ధమవడమో తేల్చుకోవాలని బ్రిటీష్ సైన్యం ఆదేశాలను విజయరామరాజు ధిక్కరించారు. తన నాలుగువేల సైన్యంతో పద్మనాభం వద్ద యుద్ధానికి సిద్దమయ్యారు. అయితే గాఢనిద్రలో ఉన్న విజయనగరం సైన్యం తెల్లవారకముందే బ్రిటిష్ మూకలు దాడిచేసి భయభ్రాంతులకు గురిచేశారు. పరిస్థితిని అంచనా వేసిన విజయరామరాజు తన వెంట వచ్చిన సైన్యంతో కలిసి తెల్లదొరలపై జూలై 10వ తేదీన పోరాడారు. అయితే విజయనగరం సైనికుల్లో ఒకడు శత్రుసేనానితో చేతులు కలపడంతో ఔంగదారిలో వచ్చి తెల్ల దొరలు కురిపించిన గుండ్ల వర్గానికి చిన విజయరామరాజుతో పాటు సుమారు మూడు వందల మంది సైనికులు, సామంత రాజులు నేలకొరిగారు. వీరి తిరుగుబాటు తెల్లవారి వెన్నులో వణుకు పట్టించింది. అంతేకాకుండా తర్వాత తరాలకు తర్వాత జరిగిన అనేక ఉద్యమాలకు ఊపిరిగా, ఉత్తేజంగా నిలిచింది.<ref>ఆంధ్రజ్యోతి దిన పత్రిక - తే.10.07.2016ది. - నాల్గవ పుట - గుంట లీలా వరప్రసాదరావు</ref>
==పర్యవసానం==
చిన విజయరామరాజు చనిపోయిన తరువాత అతని కుమారుడైన నారాయణబాబు [[మక్కువ]] ప్రాంతంలో తలదాచుకున్నాడు.
Line 32 ⟶ 35:
 
ఆంగ్లేయులు విజయనగరాన్ని ఆక్రమించిన తరువాత కారాగారంలో బంధింపబడిన జమిందారులకు విముక్తి కలిగించారు. వారి భూములను వారి ఆధీనం చేసి వారితో ప్రత్యేక ఒడంబడికలు చేసుకున్నారు. క్రీ.శ. [[1802]]లో వారి జమీనులకు శాశ్వత శిస్తు నిర్ణయ విధానం అమలు జరుపబడినది.
==విజయరామ రాజు సంస్మరణ దినం==
 
విజయరామరాజు సంస్మరణ దినాన్ని ఏటా పద్మనాభయుద్ధ ఘటనగా నిర్వహించుకోవడం ఉత్తరాంధ్ర లో ఆనవాయితీగా వస్తున్నది. పద్మనాభయుద్ధానికి గుర్తగా రెండో విజయరామరాజు సమాధిని, స్మారకమందిరాన్ని మండల కేంద్రమయిన పద్మనాభంలో నిర్మించారు.
==మూలాలు==
*ఆంధ్రప్రదేశ్ సమగ్రచరిత్ర, పి.వి.కె.ప్రసాదరావు, ఎమెస్కో, విజయవాడ, 2007.
"https://te.wikipedia.org/wiki/పద్మనాభ_యుద్ధం" నుండి వెలికితీశారు