బూరాడ గున్నేశ్వరశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
ఫలముదయింపజేయ నొకపట్టున భోరున గాలితోడ '''వా
నలు గురియంగ వైభవ మనాథుల కబ్బె ధరాతలంబునన్'''</poem>
 
* సమస్య: ఒక్కటి తక్కువైన యెడ నొప్పుగ దొమ్మిదియే పదయ్యెడున్
పూరణ:<poem>చక్కని గోడపై గలదు సారెకు టిక్కుటకంచు గొట్టుచున్
నిక్కువమైన కాలమును నేర్పుగ జూపుచు శ్రాంతిలేకయే
యక్కట సేవజేయు గడియారమునందలి రోమ నంకెలం
దొక్కటి తక్కువైనయెడ నొప్పుగ దొమ్మిదియే పదయ్యెడున్
</poem>
===దత్తపది===
* విత్తి, హత్తి, మొత్తి, సత్తి అను పదాలతో భారతార్థములో తేటగీతి
<poem>విత్తి జూదాన గలహంపు విత్తనములు
హత్తి కృష్ణుని సాహాయ్యమంది తుదకు
మొత్తి కౌరవులను బాంధవులు జయింప
సత్తి ధర్మమునకు గల్గె జగతియందు
</poem>
* రామ-లక్ష్మణ-భరత-శతృఘ్న నాలుగు పదములతో సంధికి వచ్చిన శ్రీకృష్ణునితో దుర్యోధనుడు అన్న మాటలు.
 
<poem>భళిరా మత్సరి వౌదు వర్జునుని గెల్వన్ గర్ణుడున్నాడుగా
కొలయన్ లక్ష్మణ బాలవీరు డభిమన్యుం జీల్చి చెండాడు వా
రలకేదీ విజయంబు ఈ భరత సామ్రాజ్యంబు మాదే యగున్
యిల శతృఘ్నుల మౌదు మోయి హరి! నీకేలా దురాలాపముల్
</poem>
===వర్ణన===
* సూర్యోదయ వర్ణన:
<poem>అది రోదరోంతర భావి కార్య కలనా ప్రారంభ సంశోభితా
భ్యుదయా భంగ విహంగ సంగతరవాభోగావకీర్ణ స్థలా
స్పద సంభావిత వృక్ష చక్షణ కళాభాగ్యస్థితారోగ్య కృ
ద్గతి తావాస విలాస లాలస ముషఃకాలమ్ము శోభిల్లెడిన్
</poem>
 
==మూలాలు==