హనుమంతుడు: కూర్పుల మధ్య తేడాలు

→‎రామ లక్ష్మణులతో స్నేహం: వ్యాకరణం స్థిరం
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
→‎స్వయంప్రభా సర్శనం: వ్యాకరణం స్థిరం
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 83:
 
==స్వయంప్రభా సర్శనం==
డస్సిఅలిసి పోయి ఉన్న వారికి ఒక బిలం , ఆ బిలంలోనుండి వస్తున్న హంసలు మొదలైన పక్షులు కనిపించాయి. పక్షులొస్తున్నాయి గనక నీరు చెట్లు సమృధ్ధిగా ఉండే చోటు అని ఊహించి అంతా బిల మార్గంలో ప్రవేశించి వెళ్లారు. యోజనం పైగా నడిచినా వారికి అక్కడ ఏమీ కనపడక ప్రాణాలు కడగంటే స్థితికి వచ్చారు. అలా దీనంగా ఉన్న వేళ వారికి ఒక అద్భుతమైన పూల గుత్తెలు, విమానాలు, బంగారు సోపానాలు కలిగిన మణిమయ మండపాలు స్వర్ణ వర్ణంతో ఉన్న తాబేళ్ళు చేపలు, నిర్మలమైన నీరు, పళ్ళు ఉన్న స్థలం కనిపించింది. అక్కడ అగ్నిలా ప్రకాశిస్తున్న ఒక తపస్విని ఉన్నది. హనుమంతుడు ఆమెకు చేతులెత్తి నమస్కరించి తమ వౄత్తాంతం చెప్పుకొన్నాడు. ఆమె వారికి అతిధ్యం ఇచ్చి.తన పేరు స్వయం ప్రభ అని హేమ స్నేహితురాలినని ఇది విశ్వకర్మ నిర్మించిన ప్రదేశమని, ఇక్కడకు వచ్చిన వారు తిరిగి పోలేరని చెప్పి వానరులపై దయతో బిలం దాటించి వారికి పరిసరాల వివరాలు తెలిపి జాగ్రత్తలు చెప్పింది. వారు బయటకు వచ్చి సీతను చెప్పిన గడవులో వెతికి గుర్తించలేందుకు చండశాసనుడైన సుగ్రీవుడు మరణ దండన విధించి తీరుతాడుగనక ఇలా ఆకలి దప్పులతో మరణించడమే మంచిదనిపించింది. వానర మూకను సంపాతి అనే పక్షి గమనించి చాలా కాలానికి తనకు ఆహారం సమృధ్ధిగా దొరికిందని వారితో అని భక్షించడానికి పూనుకొన్నది. అప్పుడు అంగదుడు హనుమతో" చూసావా హనుమా! జటాయువులా మనకు దురదృష్టకరమయిన మరణం రాసిపెట్టి ఉన్నది." అన్నాడు. సంపాతికి జటాయువు సోదరుడు. సంపాతి వారితో" ఓయీ! జటాయువును నీవు ఎరుగుదువా?" అని ఆసక్తిగా అడిగింది. అప్పుడు హనుమ సీతాన్వేషణం దాకా మొత్తం కథను చెప్పాడు. అది విని సంపాతి" నాయనా! జటాయువు నా సోదరుడు. అతని మరణానికి కారణమైన రావణుడిపై వృధ్ధుడనై, సూర్యతాపం వలన రెక్కలు కాలినందున పగ తీర్చుకొనలేను.కానీ నాకు యోజనాల దూరం ఇక్కడనుంచే చూసే శక్తి ఉన్నది. సీత సముద్రానికి ఆవల విషన్నవదనయై లంకానగరంలోని అశోక వృక్షం కింద భర్తకోసం విలపిస్తున్నది. సముద్రాన్ని దాటి వెళ్ళి ఆమెను రక్షించండి " అన్నాడు.
===కిష్కింధ కాండ===
[[File:Sampati's Find.jpg|thumb|సీత గురించి వానరులకు చెబుతున్న సంపాతి]]
పంక్తి 151:
తరువాత హనుమంతుడు ఆ దండను పిచ్చి దండలా తుంచి వేసెను. సభలోని వారందరూ ఆశ్చర్యపోయిరి. లక్ష్మణునికి కోపము వచ్చినది. ఆంజనేయా! నీవు ఏమి చేయుచుంటివి అని ప్రశ్నించెను. హనుమంతుడు మాత్రం "శ్రీరాముడు లేని ఈ దండ నాకు అనవసరం" అని పల్కెను.
అప్పుడు లక్ష్మణుడు మరింత కోపోద్రిక్తుడై "శ్రీరాముడు నీలో ఉన్నాడా?" అని ప్రశ్నించెను. శ్రీరాముడు మాత్రం అంతా ప్రశాంతంగా గమనించుచుండెను. అప్పుడు హనుమంతుడు తన హృదయమును చీల్చెను. అప్పుడు హనుమంతుని హృదయం నుండి కాంతిమంతంగా సీతారాములు అగు పడిరి. అందరూ ఆశ్చర్యానందాలతో పరవశించిపోయిరి.
 
==వానరుల శక్తి==
సీత లంకలో ప్రాణాలతో క్షేమంగా ఉన్నట్టు తెలిసి ఆనందించి వారు సముద్రాతీరానికి వెళ్ళారు. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం శతయోజనాల విస్తీఈర్ణం ఉన్న మహాసముద్రాన్ని చూడగానే చప్పగా చల్లారిపోయింది. ఈ కడలిని లంఘించి ఆవలి ఒడ్డుకు వెళ్ళడం ఎలా? అని వారు విదారంలో పడ్డారు. అంగదుడు వారితో ఈ సముద్రాన్ని దాటగలవారు మనలో ఎవరు?" అని అడిగాడు. గజుడు పది యోజనాలు, గవాక్షుడు ఇరవై, గవయుడు ముప్ఫై, శరభుడు నలభై, మాదనుడు యాభై, మైందుడు అరవై,ద్వివిదుడు డెభ్భై, సుషేణుడు ఎనభై ఆమడలు ఎగరగలరని తేలింది. జాంబవంతుడు తాను ప్రస్తుతం వృధ్ధుడినికనుక తొంభై ఆమడలవరకు ఎగురగలనన్నాడు. అంగదుడు" నేను నూరుయోజనాలు ఎగిరగలను. కానీ తిరిగిరాగలనా అని సందేహిస్తున్నాను" అన్నడు. అప్పుడు జాంబవంతుడు " రాజా ! నీవు రాజువు గనక ఎవరిననైనా పంపాలే తప్ప వెళ్ళడం పద్దతికాదు." అన్నాడు. అప్పుడు "
"https://te.wikipedia.org/wiki/హనుమంతుడు" నుండి వెలికితీశారు