చల్లా పిచ్చయ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''చల్లా పిచ్చయ్యశాస్త్రి''' మహాకవి, శతావధాని, పండితుడు మరియు సంగీత విద్వాంసుడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[విజయ (సంవత్సరం)|విజయ]] నామ సంవత్సర [[ఆషాఢ శుద్ధ ఏకాదశి]]నాడు [[గుంటూరు]] జిల్లా, [[ఇంటూరు]] గ్రామంలో వెంకమాంబ, పున్నయ్య దంపతులకు జన్మించాడు<ref name="అవధాన సర్వస్వము">{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=203-208|edition=ప్రథమ|accessdate=14 July 2016|language=తెలుగు|chapter=అవధాన విద్యాధరులు}}</ref>.
===బాల్యము, విద్యాభ్యాసము===
ఇతడు వీధిబడిలో చదువుకుంటూ మామ రాజనాల వేంకటసుబ్బయ్యశాస్త్రివద్ద రఘువంశం ప్రథమసర్గ పూర్తిచేశాడు. వల్లూరులోని ప్రతాపరామయ్య వద్ద రఘువంశం ద్వితీయ సర్గ ప్రారంభించాడు. తరువాత పాతూరి రామస్వామి వద్ద రఘువంశములోని ద్వితీయ,తృతీయ సర్గలు పూర్తిచేసి, కుమార సంభవములోని మొదటి ఐదు సర్గలు చదివాడు. తాడేపల్లి వేంకటసుబ్బయ్య వద్ద నాటకాలంకార శాస్త్రములతోపాటుగా సంస్కృత పంచకావ్యములు, మనుచరిత్ర మొదలైన ఆంధ్రకావ్యములు అధ్యయనం చేశాడు.