వెల్లుల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
మనకి తెలిసినంతవరకు, ప్రపంచంలోనే అతి ప్రాచీన వైద్య గ్రంథంగా కొనియాడబడుతూన్న, ఈజిప్టులో దొరికిన, ఎబర్స్ పపైరస్ (Ebers Papyrus) లో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. ఎంతో మంచి స్థితొలో ఉన్న ఈ గ్రంథం సా. శ. పూ. 1552 నాటిదని శాస్త్రవేత్తలు తేల్చేరు. కాని ఇది సా. శ. పూ. 3400 లో రచించిన అసలు గ్రంథానికి ఒక నకలు మాత్రమేనని అభిజ్ఞావర్గాలలో గట్టినమ్మకం ఉంది. ఈ పుస్తకంలో వెల్లుల్లితో 22 రోగాలని కుదిర్చే పద్ధతులు కనిపించేయిట.
 
అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాలలో వెల్లుల్లి ప్రస్తావన ఉంది. ఒక బ్రిటీష్ ప్రభుత్వోద్యోగి 1890లో సేకరించిన "బోవర్ మేన్యుస్క్రిప్ట్‌ (Bower Manuscript) అనే భూర్జపత్ర గ్రంథం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బొడ్లియెన్ గ్రంథాలయంలో ఉంది. ఇది ఆరవ శతాబ్దంలో రాసిన మాతృకకి నకలుట. ఈ గ్రంథంలో వెల్లుల్లి ప్రస్తావన అనేక సార్లు కనిపిస్తుంది. <ref>Robin Cherry, Garlic: An edible biography, Roost Books, Boston, 2014. ISBN 978--1-61180-160-6</ref> <ref>[http://www.berkeleywellness.com/supplements/herbal-supplements/article/power-garlic వెల్లుల్లి వల్ల లాభాలు]</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/వెల్లుల్లి" నుండి వెలికితీశారు