అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
=== అభివృద్ధి ===
సినిమా స్క్రిప్ట్ రాసేందుకు [[అరకు లోయ]]లోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ తీసుకుని దర్శకుడు, నిర్మాతలు అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. వంశీ అక్కడ ఆ వాతావరణంలో స్క్రిప్ట్ మొత్తం రెండు వారాల్లో పూర్తిచేసేశారు.<ref name="వంశీ ఇళయరాజా ఫన్ డే" />
=='అన్వేషణ ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్<ref name="'అన్వేషణ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్">{{cite web|url=http://telugu.greatandhra.com/movies/movie-news/director-vamsi-fb-post-about-anveshana-movie--72842.html|title='అన్వేషణ' పై వంశీ ఆసక్తికరమైన ఫేస్ బుక్ పోస్ట్|publisher=greatandhra.com|date= 2016-7-15|accessdate=2016-7-15}}</ref>==
‘అన్వేషణ’ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒకానొక క్లాసిక్. సస్పెన్స్ జోనర్ సినిమాలో ఆల్ టైమ్ హిట్ అనదగ్గ సినిమా. దర్శకుడు వంశీ అపూర్వ సృష్టి. ఈ తరం ప్రేక్షకులు కూడా యూట్యూబ్ ద్వారానో, టీవీల్లో ప్రసారం అయినప్పుడో.. ఆస్వాధిస్తూనే ఉంటారు. ప్రేక్షకులకే కాదు..సినీ క్రియేటర్ల కు కూడా అన్వేషణ స్ఫూర్తి ఎంతో ఉంది. ఈ సినిమా స్ఫూర్తితో ఆ తర్వాత ఎన్నో థ్రిల్లర్లు రూపొందాయి. అయితే ఏవీ ఈ స్థాయిలో వందో వంతుకు కూడా చేరుకోలేకపోయాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఈ సినిమాకు పెద్ద ఫ్యాన్. ఈ సినిమాను లెక్కకు మించినన్ని సార్లు చూశానని చెప్పే వర్మ స్వయంగా నిర్మాతగా మారి వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా రూపొందించారు. ఈ క్లాసిక్ గురించి చెప్పుకొంటే ఇలాంటి ముచ్చట్లు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలో కొన్నింటిని తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా అందించారు వంశీ. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
 
సస్పెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అది ఇప్పట్నుంచి కాదు.నా చిన్నప్పట్నుంచి. మా పసలపూడిలో కర్రోరి సుందరయ్య కిళ్ళికొట్లో డిటెక్టివ్ నవలలు అద్దెకి తెచ్చుకుని తెగచదివే రోజుల్నుంచీ.
 
సితార సినిమా తర్వాత నన్నుఅప్రోచ్ అయిన కామినేని ప్రసాద్ గారు, నాతో సిన్మా తియ్యడానికి అడ్వాన్స్ ఇచ్చి ఫలానా రకం కథతో సినిమా తీద్దాం అనకండా ‘’మీ ఇష్టమొచ్చిన కథతో తియ్యండి సినీమా, ఐతే, ఆ కథేంటో నాలుగు ముక్కల్లో నాక్కొంచెం చెప్పండి చాలు.’’ అన్నారు.
 
ఆయనలాగన్నాకా, భళే హుషారొచ్చింది నాకు... మొన్నేగదా సితార తీసేను ఈసారి నాకిష్టమైన సస్పెన్స్ ఫిల్మ్ చేద్దామనుకున్నాను, రెండు రోజుల తర్వాత ......అంతకు ముందెప్పుడో చూసిన కన్నడం సినిమా ‘’అపరిచితులు’’ గుర్తుకొచ్చింది. దాంట్లో మొత్తం కథ అడివిలో జరుగుతుంది. నేను కూడా అడివి బ్యాక్ డ్రాప్ లో కథ చేద్దామని ఆలోచించడం మొదలుపెట్టాను కానీ, తెలుగులో సస్పెన్స్ తరహా స్క్రిప్ట్లు రాసే రచయితలు లేరు, డైరెక్టర్లే రాసుకోవాలి. అప్పటికీ కొందరు రైటర్స్ ని ట్రై చేశాను. రాశారు. కొందరు సగంలో వెళ్ళిపోయారు. నేను అనుకుంటున్నట్టు రావడం లేదు కథ.
 
దాంతో, నేనే మొదలెట్టాను చివరికి. ఐతే, కథ మనసులోపలుందిగానీ, నోటితో చెప్పలేను. అప్పుడే కాదు. ఇప్పుడు కూడా అంతే, కథ చెప్పి ఒప్పించడం నాకు రాదు. మరి, నిర్మాతగారికెలా చెప్పాలి. ఒక నవలలాగా రాసిద్దమంటే చాలా టైం పడ్తుంది. నెలాఖర్నుంచి షూట్ అంటున్నారు. ఎలాగా? అంతలో ఇందిరాగాంధీ చనిపోవడం, భీభత్సమైన తుఫాను రావడం జరిగాయి. దాంతో కొన్నాళ్ళు షూటింగులన్నీ స్థoభించి పోయాయి. ఆ టైములో రాత్రి పగలు కష్టపడి ఆ సిన్మాకథని నవలలాగ రాశాను. చదివిన నిర్మాతా, అయనపార్టనర్లు బానే ఉందన్నారు.
 
ఫ్లో చాలా బాగుండడం వల్ల, ఇంక సినిమా స్క్రిప్ట్ అంటూ ప్రత్యేకంగా రాయకండా, ఆ నవలలో చాప్టర్లే సీన్లుగా విడదీసి షూట్ చేద్దామన్న నిర్ణయానికొచ్చాను.
 
తిరుపతి దగ్గర తలకోన ఫారెస్ట్ లో ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారు సెట్ వేశారు. నెరబయలు అనే ఆ అడివిలో ఉన్న ఒక గ్రామంలో యూనిట్ స్టే. ఒకోళ్ళకి ఒకో ఇల్లు. లోపలే సౌకర్యాలూ లేవు. బాత్రూము, లెట్రినూ ఉన్న ఇంటికేక్కడో దూరంగాఉంటాయి. మేమదేమీ పట్టించుకోలేదు, ఇబ్బంది పడలేదు. అసలు ఇచ్చిన ఇళ్ళల్లో పది నిమిషాలు ఉంటేగదా పట్టించు కోడానికి?
 
కెమెరామాన్ ఎంవి.రఘు గారి అసిస్టెంట్లు ముగ్గురూ ఎప్పుడూ నాతోనే ఉండేవాళ్ళు. జీప్ వేసుకుని పగలనకా, రాత్రనకా, ఎండల్లో, వెన్నెల్లో, చీకట్లో, చిరుగాల్లో కలతిరుగుతుంటే రకరకాల పక్షులు, అడివి జంతువులు...ఒక రోజయితే షూట్ అయ్యేకా అడివిలోంచి వస్తుంటే దారికడ్డంగా పడుకుని ఉంది పులి...... మాకందరికీ ఒకటే ఒణుకు.
అది హీరోయిన్ ఓరియంటెడ్ కథ . ఏ టైమంటే ఆ టైముకి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎలావుంటే అలా పరిగేట్టుకుంటా వచ్చేసేది హీరోయిన్.
 
‘’ఇక్కడి అడివికి తలకోన అని ఎందుకు పేరొచ్చింది సుబ్రమణ్యం?’’ అడిగేను. నాదగ్గర పనికిపెట్టిన ఆ లోకల్ మనిషిని.
 
‘’అడివి మధ్యలో చాలా ఎత్తయిన కొండ వుంటుంది దానిపేరే తలకోన. దాని పైనుంచి నీళ్ళు కారుతుంటాయి....వాటర్ ఫాల్స్ ...అది శివుడుండే చోటు ..అసలు ఇన్నాళ్ళ నించి షూటింగ్ చేస్తా అక్కడికెల్లకపోవదమేంటి మీరు?’’ అన్నాడు సుబ్రహ్మణ్యం.
 
‘’వేల్లలేదులే గానీ చాలా దూరమా?’’అన్నాను.
 
‘’దూరమంటే .....అడివిలో నడిచెల్లాలి’’అన్నాడు.
 
ఎదలో లయ అన్న పాటలో కొంత అక్కడ తీద్దాం అనుకుని బయల్దేరాం.
 
కొండలు, గుట్టలు, కొన్ని పొదల్లో కటిక చీకటి. నానా అవస్తా పడతావెళ్లిన మేం ఆ తలకోనని చూశాక అన్నీ మరిచి పోయాం. సాక్షాత్తూ శివుడి శిరస్సు మీంచి దిగుతున్నట్టే వుందా జలం ....రెండో మూడో షాట్స్ తీయగాలిగామంతే కానీ, అదో అనుభవం.
 
పిక్నిక్ కెళ్ళి వస్తున్నట్టు మా తిరుగు ప్రయాణం.
 
సీన్ పేపర్ చేతిలో ఉండేది కాదు..ఆ అడివిలోకి ఎవరూ ఎప్పుడూ వెళ్ళని ప్రదేశాల్లోకి దూరి మరీ షూట్ చేశాం. రాత్రుళ్ళసలు నిద్రపోయేవాడిని కాదు.ఒకోసారి నేనున్నాఇంటి కిటికీలోంచి చంద్రుడు కనిపించేవాడు. ఒకరంగు లో ఎప్పుడూ నాకు కనిపించలేదా చంద్రుడు. రకరకాల రంగులు......కళ్ళు,మనసు నిత్యం కలలు కనడం అంటే అదేనా ??? ఏమో మరి.
 
లోకి అనే అసిస్టెంట్ కెమెరామేన్ రాత్రయితే అందరితోనూ గొడవలు పడి,సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోయి ,తెల్లవారు ఝామునే వెనక్కోచ్చేసేవాడు ఆడో పెద్ద కామెడి మాకు .షూటింగ్ కోసం రకరకాల పక్షుల్ని చెన్నై నుంచి తీసుకొస్తే వాటిలో కొన్నింటిని ఒండుకు తినేసేవాళ్ళు సెట్ బాయ్స్ .కుందేళ్ళ విషయం చెప్పక్కర్లేదు.ఒక పక్కనించి వాళ్ళని తిడతా ,చిరాకు పడతా.......
 
ఆడతా ,పాడతా షూట్ కి బయలుదేరే మేo, ఏ చప్పుడూ లేని ఆ అడవుల్లో అద్భుతమైన నిశ్శబ్దాన్ని రుచి చూశాం.ఆ నిశ్శబ్దంలో సంగీతం విన్నాం.ఒకోప్పుడప్పుడు ఇళయరాజా అద్భుతాల్ని విన్నాం .నాకు అంత గొప్ప పాటలిచ్చారు మా గురువు .పగలే చీకటిగా ఉండే ఆ అడవుల్లో షూటింగ్ ఒకరోజు కాదు ,రెండు రోజులు కాదు ,నెలరోజుల పైన ఎన్నో రోజులు ,ఎన్నో రాత్రులు,పగళ్ళు...
 
సహజంగా ఏ సినిమా అయినా ఆర్.ఆర్ కి నాలుగు రోజులు టైం పడితే, ఈ సినిమాకి ఏడు రోజులు పైన పట్టింది ఇళయరాజా గారికి.మాటలు తక్కువ, నిశ్శబ్దం ఎక్కువ .ఆ నిశ్శబ్దం నిండా ఇళయరాజా గారి స్కోరు.వింటుంటే ఆ సంగీతంలో రుచుల గురించేం చెప్పాలి?కొన్ని వివరించడానికి భాష ఉండదు కదా .
అంతా అయ్యేక సినిమాకి పేరు పెట్టాను......’’అన్వేషణ’’
 
అన్వేషణ ఆర్.ఆర్.ఆఖరి రోజున , ఇళయరాజాగారికప్పుడే చత్వారం రావడంతో ‘’మేజర్ సుందర్ రాజన్ గారికి సంబందిచిన కళ్ళడాక్టర్ దగ్గరకెళ్ళాలి నువ్వూ రా’’ అన్నారు రాజాగారు.
 
నన్ను చూసిన మేజర్ ‘ఈ కుర్రాడు ఎవరు రాజా?’’అన్నారు. ‘’తెలుగు...అన్వేషణ అని ఒక సస్పెన్స్ ఫిల్మ్ తీశాడు. రీరికార్డింగ్ లాస్ట్ రీల్ జరుగుతుంది. ఇంగ్లీష్ ఫిల్మ్ లా తీసేడు అన్నా’’అన్నారు ఇళయరాజా.
 
అదివిన్న నేను ‘నా మీదున్న వాత్సల్యంతో అలాగంటున్నారు .నేనేమీ ఇంగ్లీష్ సిన్మాలా తియ్యలేదు . కానీ. ఆయనిచ్చిన మ్యూజిక్ వల్ల అలాంటి కలరొచ్చిందేమో’ అనుకున్నాను.
 
ఈ సిన్మాని మెచ్చుకున్న చాలా మంది అన్నవి అన్నట్టు రాస్తే, స్వడబ్బాలా ఉంటుంది గాబట్టి ఆ సైడెళ్ళను.
 
ఐతే ...ఆ సిన్మాకెన్ని జ్ఞాపకాలో...అన్నీపారిజాతాల్లాగ రాలి పోయిన జ్ఞాపకాలు .వాడిపోని జ్ఞాపకాలు.
 
నిజమే వర్తమాన మెప్పుడూ బాగోదు.అది, జ్ఞాపకమైనప్పుడే బాగుంటుంది.ఆ జ్ఞాపకంలో పిసరంత వేదన కలిస్తే చారుకేశి రాగంలా హృదయాన్ని తడి చేస్తా మరీ బాగుంటుంది.. ఆ అన్వేషణకెన్ని జ్ఞాపకాలు. అన్నీ, లేతాకు పచ్చని కాదు ,ముదురాకు పచ్చని జ్ఞాపకాలు.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు